Director Sujeeth: సుజీత్‌ను తిప్పించుకుంటున్నారా?.. ఛాన్సులివ్వరా?.. మూడేళ్లుగా మెగాఫోన్‌ పట్టని సాహో డైరెక్టర్‌..

పెద్ద పెద్ద డిజాస్టర్స్ తీసిన దర్శకులకే మరో అవకాశం వస్తుంది. అలాంటిది సాహో లాంటి పాన్ ఇండియా సినిమా చేసిన సుజీత్ మాత్రం మూడేళ్లుగా ఖాళీగానే ఉన్నారు. ఇదిగో అదిగో అంటున్నారే కానీ తన నెక్ట్స్ సినిమా ఏంటో..

Director Sujeeth: సుజీత్‌ను తిప్పించుకుంటున్నారా?.. ఛాన్సులివ్వరా?.. మూడేళ్లుగా మెగాఫోన్‌ పట్టని సాహో డైరెక్టర్‌..
Director Sujeeth
Follow us
Basha Shek

|

Updated on: Jul 14, 2022 | 6:23 PM

పెద్ద పెద్ద డిజాస్టర్స్ తీసిన దర్శకులకే మరో అవకాశం వస్తుంది. అలాంటిది సాహో లాంటి పాన్ ఇండియా సినిమా చేసిన సుజీత్ మాత్రం మూడేళ్లుగా ఖాళీగానే ఉన్నారు. ఇదిగో అదిగో అంటున్నారే కానీ తన నెక్ట్స్ సినిమా ఏంటో మాత్రం ఇప్పటికీ చెప్పలేదు. హీరోలు తిప్పించుకుంటున్నారు కానీ ఛాన్స్ ఇవ్వడం లేదా..? అసలు లోపం ఎక్కడుంది..? సుజీత్ మళ్లీ మెగాఫోన్ పట్టేదెప్పుడు..? కొందరు దర్శకులకు రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపు వచ్చేస్తుంటుంది. తీరా ఈ సినిమా విడుదలయ్యాక.. అంచనాలు అందుకోకపోతే పోవాల్సిన పేరు కంటే ఎక్కువగా పోతుంది. ఈ రెండూ సుజీత్ విషయంలో జరిగాయి. 30 ఏళ్లు కూడా లేకుండానే 300 కోట్లతో సాహో తెరకెక్కించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. రన్ రాజా రన్ లాంటి చిన్న సినిమా తర్వాత.. ఏకంగా ప్రభాస్‌తో సాహో చేసి అందరి దృష్టిలో పడ్డారు సుజీత్. కానీ అది ఫ్లాపవ్వడంతో.. అంతే వేగంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఈయన.

సాహోకు హిందీలో సూపర్‌ రెస్పాన్స్‌..

సాధారణంగా రాజమౌళితో సినిమా చేసాక.. ఆ హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఏ దర్శకుడు సాహసం చేయరు. కానీ రిస్క్ అని తెలిసినా సాహోతో ముందుకొచ్చారు సుజీత్. నిజానికి ఇది డిజాస్టర్ అయితే కాదు.. పైగా అప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో సుజీత్ ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. కాకపోతే కథలో విషయం లేకపోవడంతో సాహో తేలిపోయింది. అయినా కూడా 217 కోట్లు షేర్ వసూలు చేసింది సాహో. తెలుగులో డిజాస్టర్ అయినా.. హిందీ ఆడియన్స్‌కు సాహో బాగా నచ్చింది. అక్కడ ఈ సినిమా160 కోట్లకు పైగా వసూలు చేసింది. కాకపోతే సాహోకు పెట్టాల్సిన దానికంటే అదనపు బడ్జెట్ పెట్టించాడనే విమర్శలు సుజీత్‌పై ఉన్నాయి. ఇవన్నీ పక్కనబెడితే ఇంతకంటే ఫ్లాప్స్ తీసిన దర్శకులకు కూడా మరో ఛాన్స్ ఇచ్చారు మన హీరోలు. కానీ సుజీత్‌ను మాత్రం ఆడుకుంటున్నారు. మూడేళ్లుగా తిప్పించుకుంటున్నారు కానీ అవకాశం మాత్రం ఇవ్వట్లేదు.

ఇవి కూడా చదవండి

ఆ  హీరోల పేర్లు వినిపించినా..

నిజానికి గాడ్ ఫాదర్ సుజీత్ చేయాల్సిన సినిమానే. గాడ్ ఫాదర్ సినిమా కోసం ముందుగా సుజీత్‌నే తీసుకున్నారు చిరంజీవి. కాకపోతే కథలో మార్పుల విషయంలో ఇద్దరికి కుదరకపోవడంతో సీన్‌లోకి మోహన్ రాజా వచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ కోసం సుజీత్ కథలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీనికితోడు నితిన్, వరుణ్ తేజ్ లాంటి హీరోల పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌లోనూ విక్కీ కౌశల్ లాంటి హీరోలకు కథలు చెప్పారు సుజీత్. ఇటీవల పవన్‌కల్యాణ్‌ నుంచి పిలుపువచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏదీ వర్కవుట్ అవ్వలేదు. మరి సుజీత్‌కు ఈ గడ్డుకాలం ఎప్పుడు ముగుస్తుందో.. మళ్లీ ఎప్పుడు మెగాఫోన్‌ పడతారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!
ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!