AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jennifer Pamplona: అందం కోసం తాపత్రయం.. 4.50 కోట్లతో ఏకంగా 40 సర్జరీలు.. సీన్‌ కట్‌ చేస్తే..

బ్రెజిల్‌కు చెందిన జెన్నిఫర్ పాంపలోన ఫ్యాషన్‌ రంగంలో మరింత క్రేజ్‌ సంపాదించుకోవాలనుకుంది. తన అభిమాన నటి కమ్‌ మోడల్ కిమ్‌ కర్దాషియన్‌లా కనిపించాలనుకుంది. అందుకోసం 12 ఏళ్లలో ఏకంగా..

Jennifer Pamplona: అందం కోసం తాపత్రయం.. 4.50 కోట్లతో ఏకంగా 40 సర్జరీలు.. సీన్‌ కట్‌ చేస్తే..
Brazil Model
Basha Shek
|

Updated on: Jul 14, 2022 | 6:58 PM

Share

అందం అనేది పుట్టుకతో వచ్చేది. ఇంకాస్త లాజికల్‌గా చెప్పాలంటే.. మన తల్లి తండ్రుల నుంచి తాత మత్తాతల నుంచి వారసత్వంగా వచ్చేది. అలాంటి అందాన్ని రకరకాల సర్జరీల పేరుతో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. కాస్మోటిక్ సర్జరీల వెంటపడుతూ.. అందాన్ని కొని తెచ్చుకుంటున్నారు.. ముఖ కవలికలను మార్చుకుంటున్నారు. ఆపై అనారోగ్య సమస్యలొచ్చాయంటూ.. బోరున ఏడుస్తున్నారు. ఇలా తాజాగా ఓ బ్రెజిలియన్ మోడల్ కూడా.. సర్జరీల వల్లే తన ముఖం అందవికారంగా తయారయ్యిందంటూ.. నెట్టింట తన గోడు వెళ్లబోసుకుంది. బ్రెజిల్‌కు చెందిన పాపులర్ మోడల్‌.. జెన్నిఫర్ పాంపలోన! ఫ్యాషన్‌ రంగంలో మరింత క్రేజ్‌ సంపాదించుకోవాలనుకున్న ఈమె.. తన అభిమాన నటి కమ్‌ మోడల్ కిమ్‌ కర్దాషియన్‌లా కనిపించాలనుకుంది. అందుకోసం 12 ఏళ్లలో ఏకంగా 40 కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంది. ఇందుకోసం ఏకంగా 4.50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. చివరికి అనుకున్నట్టుగానే కిమ్‌కు డూప్‌లా మారిపోయింది. మోడలింగ్‌ రంగంలో ముందుకు దూసుకుపోయింది. సోషల్‌ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంది.

ముఖ కవళికలు మారిపోయి..

ఇవి కూడా చదవండి

అయితే ఆ తరువాతే సీన్ సితారైంది. అప్పటి వరకు చేసిన సర్జరీల వల్ల జెన్నిఫర్ కు సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావడం మొదలయ్యాయి. దీంతో ఆమె ముఖం అందవికారంగా అయిపోయింది. భరించరానంత నొప్పి ఆమెను తీవ్రంగా ఇబ్బందిపెట్టసాగింది. రోజు రోజుకు జెన్నీ పరిస్థితి దిగజారి పోతుండడంతో.. ఇక చేసేదేంలేక తాజాగా మళ్లీ సర్జరీ చేయించుకుంది ఈ బ్యూటీ. కాకపోతే.. ఈ సారి తన మునపటి రూపం కోసమే సర్జరీ చేయించుకుంది. అయితే జెన్నిఫర్ మొఖం మరీ దారుణంగా.. చాలా భయానకంగా తయారైంది. అయితే ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సర్జరీలకు వెళ్లవద్దంటూ..

కాగా సహజ విరుద్దమైన పనులు చేయకూడదనే గుణపాఠం నేర్చుకుంది జెన్నిఫర్‌. అందుకే సర్జీలకు వెళ్లడం మంచిద కాదని తోటి మోడల్స్‌కు సలహాలు, సూచనలు ఇస్తోంది. సర్జరీల వైపు మొగ్గుచూపే వాళ్ల కోసం ‘అడిక్షన్‌.. ఎబోట్‌ ది డేంజరస్‌ ఆఫ్‌ ది ఆపరేషన్స్‌’ పేరిట తీసే డాక్యుమెంటరీలోనూ ఆమె నటిస్తోంది. అంతేకాదు.. డీట్రాన్సిషన్‌ సెల్ఫీలను సోషల్‌ మీడియాలో సంతోషంగా పోస్ట్‌ చేస్తోంది కూడా.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..