Sri Lanka Crisis: ఆయన కేవలం టూరిస్ట్ మాత్రమే.. వివరణ ఇచ్చిన సింగపూర్..
మాల్దీవులు పారిపోయిన రాజపక్స లేటెస్ట్‌గా సింగపూర్‌లో కాలుమోపారు. ప్రస్తుతం సింగపూర్‌లో తలదాచుకుంటున్నారు. వ్యక్తిగత పర్యటన కోసమే రాజపక్స తమ దేశం వచ్చారని.. ఆశ్రయం కోరలేదని ప్రకటించింది సింగపూర్ విదేశాంగ శాఖ.
శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం మధ్య అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. మీడియా కథనాల ప్రకారం.. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో కూడిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయానికి చేరుకున్నారు. సింగపూర్‌లో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాకపై సింగపూర్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత పర్యటన కోసమే రాజపక్స తమ దేశం వచ్చారని.. ఆశ్రయం కోరలేదని ప్రకటించింది సింగపూర్ విదేశాంగ శాఖ. భార్యతో కలిసి సింగపూర్ వెళ్లిన గొటబయ ఇప్పట్లో శ్రీలంక వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. తమ దేశంలో అతనికి ఆశ్రయం ఇవ్వలేదని పేర్కొంది. గోటబయ రాజపక్సేతో కూడిన విమానం మాల్దీవులకు చేరుకుంది. మాల్దీవులలో కొద్దిసేపు గడిపిన తరువాత అతని విమానం సింగపూర్‌కు చేరుకుంది.
భారత్ జోక్యంపై ఖండించిన భారత హైకమిషన్
అదే సమయంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశం విడిచిపెట్టడంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే ఈ నివేదికలను మాల్దీవుల్లోని భారత హైకమిషన్ తిరస్కరించింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మాల్దీవుల ద్వారా నిష్క్రమించడానికి భారత ప్రభుత్వం దోహదపడిందన్న నిరాధారమైన వార్తలను హైకమిషన్ నిర్ద్వంద్వంగా ఖండించిందని మాల్దీవుల్లోని భారత హైకమిషన్ తెలిపింది. ఈ నివేదికలు నిరాధారమైనవి.
మాల్దీవుల్లో గొటబయకు నిరసన సెగ..
గొటబయ రాజపక్సకు శ్రీలంకలో మాత్రమే కాదు ఎక్కడికి వెళ్లినా నిరసనలు ఎదురవుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడి హోదాలో మాల్దీవులకు పరారైన గొటబయ రాజపక్సకు అక్కడ నిరసన ఎదురయ్యింది. . గొటబయకు ఆశ్రయంపై మాల్దీవుల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మాల్దీవులను విడిచిపెట్టాలని గొటబయ నిర్ణయించారు. సింగపూర్‌కు వెళ్లడానికి గొటబయ అన్ని ఏర్పాట్లు చేశారు. మాల్దీవుల్లో శ్రీలంక వాసులు నిరసనకు దిగారు. గొటబయ రాజపక్సకు ఆశ్రయం ఇవ్వొద్దంటూ మాల్దీవుల రాజధాని మాలేలో లంకేయులు శాంతియుత నిరసన తెలిపారు. దీంతో మాల్దీవుల పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.