వీడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి.. భయానక యాక్సిడెంట్ నుంచి వెంట్రుకవాసిలో ఎలా తప్పించుకున్నాడో చూడండి..

Viral Video: ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో కొంతమంది తీవ్రంగా గాయపడతారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రోడ్డుపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. ఎందుకంటే ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా

వీడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి.. భయానక యాక్సిడెంట్ నుంచి వెంట్రుకవాసిలో ఎలా తప్పించుకున్నాడో చూడండి..
Follow us
Basha Shek

|

Updated on: Jul 15, 2022 | 10:05 PM

Viral Video: ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో కొంతమంది తీవ్రంగా గాయపడతారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రోడ్డుపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. ఎందుకంటే ఒక్కోసారి చిన్న పొరపాటు కూడా ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో అతివేగంగా వెళ్లే వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాలు వారికే కాకుండా రోడ్డుపై నడిచే వారికి కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయి. అందుకే రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు, నడిచి వెళ్లేటప్పుడు నలుమూలలా చూసుకుని ముందుకు సాగాలని చాలామంది చెబుతారు. ఈక్రమంలో ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ భయానక ప్రమాదం నుంచి ఓ డ్రైవర్‌ వెంట్రుకవాసిలో తప్పించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రెండు వాహనాలు ఒకదానికొకటి భయంకరమైన రీతిలో ఎలా ఢీకొన్నాయో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. అందులో ఒక వాహనం బాగా దెబ్బతిని రోడ్డుపై బోల్తాపడుతుంది. మరొక వాహనంది కూడా అదే పరిస్థితి. అయితే ప్రమాద సమయంలో ఓ వాహన డ్రైవర్‌ హఠాత్తుగా రోడ్డుమీద పడిపోతాడు. అయితే అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. పైగా ప్రమాదం జరిగిన వెంటనే లేచి చుట్టుపక్కల చూస్తూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతాడు. అయితే మరో వాహనంలో ఉన్న వారి పరిస్థితేంటో ఈ వీడియోలో లేదు. బహుశా వారు కూడా స్వల్పగాయాలతో బయటపడింటారని తెలుస్తుంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో విసియస్ వీడియోస్ అనే ఐడీతో షేర్ చేశారు. దీనికి ‘హిట్ అండ్ రన్’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. కేవలం 13 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతటి భయానక యాక్సిడెంట్‌ నుంచి బయటపడ్డ ఆ డ్రైవర్‌కు ఇంకా భూమ్మీద నూకలున్నాయంటూ ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!