IND Vs ENG ODI 3rd Match Playing XI: టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. దూరమైన స్టార్ ప్లేయర్.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?

టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. దీంతో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈరోజు బ్రిటీష్‌ టీంను టీమిండియా ఓడిస్తే.. 8 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంటుంది.

IND Vs ENG ODI 3rd Match Playing XI: టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. దూరమైన స్టార్ ప్లేయర్.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?
Ind Vs Eng 1st Odi Playing Xi
Follow us
Venkata Chari

|

Updated on: Jul 17, 2022 | 3:11 PM

IND Vs ENG ODI 3rd Match Playing XI: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా మూడో, చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. దీంతో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఫైనల్ వన్డే నుంచి టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా దూరమయ్యాడు. వెన్నులో గాయం కారణంగా ఈ మ్యాచ్  ఆడడం లేదని రోహిత్ తెలిపాడు. ఈరోజు బ్రిటీష్‌ టీంను టీమిండియా ఓడిస్తే.. 8 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంటుంది. అంతకుముందు 2014లో 5 వన్డేల సిరీస్‌లో భారత్ 3-1తో ఇంగ్లండ్‌ను ఓడించింది. సిరీస్‌లోని ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లిష్ జట్టును భారత్ ఎన్నడూ ఓడించలేకపోయింది.

ఓవరాల్ రికార్డు గురించి మాట్లాడితే, ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 105 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 56 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే సమయంలో ఇంగ్లండ్ 44 మ్యాచ్‌లు గెలిచింది. 2 మ్యాచ్‌లు టై కాగా, 3 మ్యాచ్‌ల్లో ఫలితాలు లేవు.

ఇరు జట్లు..

ఇవి కూడా చదవండి

టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ