కాకినాడ, రంపచోడవరం జిల్లాల సరిహద్దుల్లోని ఏలేరు రిజర్వాయర్ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను కలవరపెడుతోంది. అడ్డతీగల మండలంలో ఆవు, దూడపై పులి దాడి చేయడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. డ్రోన్లు, బోన్లను ఏర్పాటు చేసి పులిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.