AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవం నుంచి వరల్డ్ కప్ విన్నర్ వరకు.. వైరల్‌గా మారిన స్కై ఎమోషనల్ పోస్ట్..!

Suryakumar Yadav Throwback Post: టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్‌ను నిలిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY), తన విజయానందం వేళ గతాన్ని గుర్తుచేసుకుంటూ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 12 ఏళ్ల క్రితం ఒక సాదాసీదా యువకుడిగా ఉన్నప్పటి ఫోటోను, నేడు ప్రపంచకప్ ట్రోఫీతో ఉన్న ఫోటోతో పోల్చుతూ సూర్య పెట్టిన పోస్ట్ అభిమానుల మనసు గెలుచుకుంటోంది.

పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవం నుంచి వరల్డ్ కప్ విన్నర్ వరకు.. వైరల్‌గా మారిన స్కై ఎమోషనల్ పోస్ట్..!
Ind Vs Nz Suryakumar Yadav Throwback Post Viral
Venkata Chari
|

Updated on: Mar 09, 2026 | 11:46 AM

Share

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎక్స్‌ (X) వేదికగా తన పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు.

వైరల్ పోస్ట్ విశేషాలు:

సూర్యకుమార్ తన 12 ఏళ్ల క్రితం నాటి ఒక ఫోటోను రీ-షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఆయన తన స్నేహితుడి పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. దానికి “స్నేహితుడి పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవం.. అతని కోసం చాలా సంతోషంగా ఉంది” అని అప్పట్లో క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు అదే ఫోటో పక్కన ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడుతున్న ఫోటోను చేర్చి, “ఈ రోజు ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చాడు. సామాన్య స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన తన ప్రయాణాన్ని ఆయన ఈ పోస్ట్ ద్వారా గుర్తుచేసుకున్నాడు.

ఆ క్యాచ్ నా జీవితాన్ని మార్చేసింది:

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో డేవిడ్ మిల్లర్ పట్టిన ఆ అద్భుతమైన క్యాచ్ తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో వివరించాడు.

“విమర్శలు జీవితంలో భాగం, వాటి నుంచి మనం పారిపోలేం. 2024లో బార్బడోస్‌లో పట్టిన ఆ క్యాచ్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అది ఆ టోర్నీలోనే అత్యంత కీలక క్షణం. ఆ విజయం తర్వాత భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు జట్టును నడిపించే అవకాశం రావడం చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ గెలవలేదు, ఆ రికార్డును మేం సాధించడం గర్వంగా ఉంది” అని సూర్య పేర్కొన్నారు.

భారత్ సృష్టించిన రికార్డులు:

టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకున్న (Retain) తొలి జట్టుగా భారత్ నిలిచింది.

మూడుసార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఏకైక జట్టు భారత్.

సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్న మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us