AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: అక్కడ వర్షాలు.. ఇక్కడ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

Weather Alert: అక్కడ వర్షాలు.. ఇక్కడ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Weather Update
Shaik Madar Saheb
|

Updated on: Mar 09, 2026 | 1:59 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి, గ్నేయ /నైరుతి గాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని.. సాధ్యమైనంత మేర పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. కోస్తా కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతరముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించినది. దీంతోపాటు.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ /నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం

సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

రాయలసీమ :-

సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

గమనిక :- అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానములో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. ఆ తరువాత 4 రోజుల్లో 2-3డిగ్రీల సెంటిగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది.

తెలంగాణ వెదర్ రిపోర్ట్..

తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని.. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో ఎండ తీవ్రత సగటు కంటే ఎక్కువగా ఉంటుందని.. దక్షిణ తెలంగాణలో గాలుల దిశ మారడం వల్ల వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అరసవల్లిలో కనిపించని సూర్యుడు.. నిరాశలో భక్తులు...
అరసవల్లిలో కనిపించని సూర్యుడు.. నిరాశలో భక్తులు...
మీ ఇంట్లో ఈ 3 సంకేతాలు… పెద్ద సమస్యకు ముందు హెచ్చరిక కావచ్చు!
మీ ఇంట్లో ఈ 3 సంకేతాలు… పెద్ద సమస్యకు ముందు హెచ్చరిక కావచ్చు!
అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..
అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..
మిత్రమా..మార్చి 31 సమీపిస్తోంది! పన్ను ఆదా చేయడానికి ఈ 5 మార్గాలు
మిత్రమా..మార్చి 31 సమీపిస్తోంది! పన్ను ఆదా చేయడానికి ఈ 5 మార్గాలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీ పాఠశాలల్లో బోధనా పద్ధతులను మార్చేస్తున్న ప్రభుత్వం
ఏపీ పాఠశాలల్లో బోధనా పద్ధతులను మార్చేస్తున్న ప్రభుత్వం
నాలుగు సినిమాలకే కనిపించకుండా పోయింది
నాలుగు సినిమాలకే కనిపించకుండా పోయింది
జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్‌.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఆదర్శ సర్పంచ్‌.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!