AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు! ఆరుగురు ప్రయాణికులు మృతి

గుజరాత్ లోని బర్దోలీ దగ్గర రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సూరత్ జిల్లా బర్డోలిలోని ఊవా గ్రామం సమీపంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సును..

ఘోర రోడ్డు ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు! ఆరుగురు ప్రయాణికులు మృతి
Gujarat Bus Fire Accident
Srilakshmi C
|

Updated on: Jun 02, 2026 | 8:14 PM

Share

బర్దోలీ, జూన్‌ 2: గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బర్దోలీ దగ్గర రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సూరత్ జిల్లా బర్డోలిలోని ఊవా గ్రామం సమీపంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఢీకొన్న ధాటికి బస్సుల్లో ఒకటి అదుపుతప్పి, డివైడర్‌ను దాటి రోడ్డుకు అవతలి వైపు బోల్తా పడింది. అక్కడ దానికి మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది.

సాయంత్రం 4 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న సూరత్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు సూరత్ రూరల్ ఎస్పీ రాజేష్ గధ్వీ, రేంజ్ ఐజీ ప్రేమ్‌వీర్ సింగ్ తెలిపారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులలో ఎక్కువ మంది మహారాష్ట్ర నివాసితులు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. సహాయక బృందాలు, పోలీసు సిబ్బంది, స్థానిక నివాసితులు కలిసికట్టుగా పనిచేసి బస్సుల్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో బస్సు తీవ్రంగా దెబ్బతింది. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత మృతుల సంఖ్యపై స్పష్టమైన వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ
చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను.. నా బిడ్డకు అలా జరగకూడదు: సమంత
చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను.. నా బిడ్డకు అలా జరగకూడదు: సమంత
ఆ ముగ్గురు బ్యాగులు సర్దుకోవాల్సిందే.. వరల్డ్ కప్ రేసు నుంచి ఔట్?
ఆ ముగ్గురు బ్యాగులు సర్దుకోవాల్సిందే.. వరల్డ్ కప్ రేసు నుంచి ఔట్?
మైత్రి మూవీస్ నుంచి మరో క్రేజీ మూవీ..
మైత్రి మూవీస్ నుంచి మరో క్రేజీ మూవీ..
UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌కు 2026 ఉచిత శిక్షణ.. దరఖాస్తు ఇలా
UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌కు 2026 ఉచిత శిక్షణ.. దరఖాస్తు ఇలా
పెరుగుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
పెరుగుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. ఆ జిల్లాలకు క్లౌడ్‌బరస్ట్ హెచ్చరిక!
అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. ఆ జిల్లాలకు క్లౌడ్‌బరస్ట్ హెచ్చరిక!
చికెన్‌, మటన్‌ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినొద్దు!
చికెన్‌, మటన్‌ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినొద్దు!
జూన్ 23 రాశిఫలాలు: ఈ రోజు అదృష్టం ఏయే రాశుల వారిని వరించనుంది?
జూన్ 23 రాశిఫలాలు: ఈ రోజు అదృష్టం ఏయే రాశుల వారిని వరించనుంది?
అమ్మాయిలు తెగ పాడున్నా పాట.. ఆ సాంగ్ వెనుక రహస్యం ఇదే..
అమ్మాయిలు తెగ పాడున్నా పాట.. ఆ సాంగ్ వెనుక రహస్యం ఇదే..