కడప జిల్లాలో తిరుమలకు వెళ్తున్న 21 వేల లీటర్ల నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. కొండాపురం మండలం, చిత్రావతి వంతెన సమీపంలోని జాతీయ రహదారి 67పై ఈ ఘటన జరిగింది. ట్యాంకర్ నుంచి నెయ్యి ఒలికిపోవడంతో స్థానికులు బిందెలు, బకెట్లతో అక్కడికి చేరుకుని నెయ్యిని సేకరించారు. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి.