పోషకాల ఖజానా.. నోరూరించే పూల్ మఖానా!

09 March 2026

TV9 Telugu

TV9 Telugu

మఖానా గింజల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

అయితే వీటిని కొందరు పచ్చిగానే తీసుకుంటే.. మరికొందరు వేయించుకొని, ఉడకబెట్టుకొని, కూరల్లో, స్వీట్లలో భాగం చేసుకుంటారు. ఎలా తీసుకున్నా.. ఈ తామర గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి

TV9 Telugu

క్యాలరీలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతాం. అయితే మఖానాతో ఆ సమస్య లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనిలో క్యాలరీల శాతం తక్కువ

TV9 Telugu

వీటిలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌.. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. ఫలితంగా ఆహారపు కోరికల్ని అదుపులో పెట్టుకోవచ్చు.. అధిక బరువునూ తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు

TV9 Telugu

తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి

TV9 Telugu

గ్లైసెమిక్‌ ఇండెక్స్ తక్కువగా ఉండే ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం.. ఎముకలు, దంతాల్ని దృఢంగా మారుస్తాయి

TV9 Telugu

ఐరన్ రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది. మఖానాలో సోడియం తక్కువ.. పొటాషియం, మెగ్నీషియం.. వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

TV9 Telugu

మఖానాలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తెల్లతెల్లటి బంతుల్లా కాస్త అటూఇటూగా పాప్‌కార్న్‌లా కనిపించే ఈ మఖానా కాలక్షేపానికి కూడా ముందు వరసలోనే ఉంటుంది