Weight Loss Mistakes: ఈ చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారా..? అయితే అస్సలు బరువు తగ్గరు.. అవేంటో తెలుసుకోండి
ఫిట్‌గా ఉండేందుకు ఎన్ని కసరత్తులు చేసినా.. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఫలితం లేకుండా పోతుంది. శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గడం అనేది కష్టంగా ఉంటుందని..
Weight Loss Mistakes: ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పెరగడం అనేది ఇటీవల కాలంలో పెద్ద సమస్యగా మారింది. గత రెండేళ్లలో ఇలాంటి సమస్యలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ లాక్‌డౌన్ ఆ తర్వాత ఇంటి నుంచి పని చేయడం.. శారీరక శ్రమ తగ్గడం సమస్యగా మారింది. దీంతో చాలా మంది బరువు పెరుగుతున్నారు. అనంతరం ఫిట్‌గా ఉండేందుకు ఎన్ని కసరత్తులు చేసినా.. చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఫలితం లేకుండా పోతుంది. శరీర బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గడం అనేది కష్టంగా ఉంటుందని.. అయితే ఓ క్రమ పద్దతిలో ప్రణాళిక చేస్తే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా బరువు తగ్గకుండా అడ్డుకుంటాయి. బరువు తగ్గించే ప్రక్రియలో మనం తరచుగా చేసే తప్పులు ఏంటి..? అవి ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకోండి..
ఈ తప్పులు చేస్తే అస్సలు బరువు తగ్గరు..
నీరు తక్కువగా తాగడం: మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిండిఉంటుంది. కావున మనం ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. అలాగే నీటి ద్వారానే శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. శరీరంలో నీటిశాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
అల్పాహారం: అల్పాహారం మానేయడం వల్ల శరీరానికి శక్తి లభించదు. దీంతో శరీరం బాగా అలసి పోతుంది. అందుకే తప్పనిసిగా అల్పాహారం తీసుకోవాలి. దీంతో అలసిపోకుండా రోజు చేసే పనిని చేయవచ్చు.
రాత్రిపూట తీపి పదార్థాలు తినడం: తీపి వంటకాలు ఎల్లప్పుడూ బరువు పెరగడానికి కారణమవుతాయి. అయితే.. పగటివేళ కంటే.. రాత్రి సమయంలో చక్కెరతో చేసిన తీపి పదార్థాలను తింటే ఊబకాయం వేగంగా పెరుగుతుంది. అలాంటి అలవాటుంటే ఈరోజే నుంచే వదిలేయడం మంచిది.
తగినంత నిద్ర: తగినంత నిద్ర లేకపోవడం ఊబకాయం పెరగడానికి కారణమవుతంది. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి. నిద్ర లేమి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతోపాటు రోజంతా అలసిపోయేలా చేస్తుంది.
శారీరక శ్రమ: శారీరక శ్రమ లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది. బరువు తగ్గాలనుకునే చాలా మంది ఉన్నప్పటికీ.. శారీరక శ్రమపై పెద్దగా శ్రద్ధ చూపరు. అటువంటి పరిస్థితిలో ఆశించిన ఫలితం లభించదు. బరువు తగ్గించే ప్రక్రియకు కఠినమైన ఆహారంతో పాటు, వ్యాయామం కూడా అంతే ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..