Health Tips: ఉల్లి, వెల్లుల్లి తొక్కలను పడేస్తున్నారా..? అయితే.. ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
ఇంట్లో రోజూ ఉపయోగించే కొన్ని కూరగాయల తొక్కలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని మీకు తెలుసా...? తెలియకపోతే వాటి గురించి తెలుసకోవాలంటున్నారు నిపుణులు.

Onion and Garlic Peels Benefits: చాలామంది ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల పండ్లను తింటుంటారు. అయితే.. సాధారణంగా పండ్ల తొక్కల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిసినప్పటికీ.. వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఇంట్లో రోజూ ఉపయోగించే కొన్ని కూరగాయల తొక్కలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని మీకు తెలుసా…? తెలియకపోతే వాటి గురించి తెలుసకోవాలంటున్నారు నిపుణులు. ఉల్లిపాయలు, వెల్లుల్లిని ప్రజలు వాటిని వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల ఆహార పదార్థాల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. కొంతమంది ఉల్లిపాయలను సలాడ్‌గా కూడా చాలా పలు ఆహార పదార్థాల్లో కలుపుకొని తింటారు. వేసవిలో వేడి నుంచి రక్షించడంలో ఉల్లిపాయ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రజలు తరచుగా ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఉపయోగించి తమ తొక్కలను డస్ట్‌బిన్‌లో వేస్తారు. కావున వాటి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..
ఎరువుగా ఉపయోగిస్తారు..
ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలు పారేయకుండా వాటిని ఎరువుగా ఉపయోగించవచ్చు. వాటితో తయారుచేసిన ఎరువు మొక్కలకు చాలా మంచిదని పేర్కొంటారు. ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ పుష్కలంగా ఉంటాయి.




జుట్టుకు ప్రయోజనం..
ఉల్లిపాయ తొక్కలు జుట్టును మెరిసేలా చేస్తాయి. ఉల్లిపాయ తొక్కలను నీటిలో ఉడకబెట్టి, ఈ నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. అదే సమయంలో తలకు వేసే జుట్టు రంగులో కూడా వీటిని ఉపయోగిస్తారు. ఉల్లిపాయ తొక్కలను నీటిలో అరగంట వరకు ఉడకబెట్టండి. ఈ నీటితో తలకు మసాజ్ చేయండి, అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకుంటే.. సహజమైన రంగులా మెరిసిపోతుంది.
తిమ్మిరి దూరం..
కొన్నిసార్లు శరీరం కండరాలలో తిమ్మిర్లు వస్తుంటాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అటువంటి పరిస్థితిలో ఉల్లిపాయ తొక్కలను 10-15 నిమిషాలు నీటిలో ఉంచండి. రాత్రి పడుకునే ముందు ఈ నీటిని తాగండి. ఇది కండరాల తిమ్మిరి నుంచి చాలా ఉపశమనం కలిగిస్తుంది.
దురద నుంచి ఉపశమనం..
తరచుగా చర్మంపై దురద, దద్దుర్లు లాంటివి వస్తాయి. ఇందుకోసం ఎన్నో రకాల మందులు కూడా వాడుతున్న ఉపశమనం కలగదు. అలాంటి పరిస్థితుల్లో.. ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి తొక్కలతో ఈ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. నీటిలో నానబెట్టిన ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలను శరీర చర్మంపై పూయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.




