Heart Risk: ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా..? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి
భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మరణాలకు గుండెపోటు ప్రధాన కారణంగా ఉంది. కావున తీవ్రమైన గుండె జబ్బులను మనం చాలావరకు నివారించవచ్చంటున్నారు నిపుణులు.
Heart Attack Causes: ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా పెద్దవారితోపాటు.. యువతలో కూడా గుండె సమస్యలు పెరుగుతున్నాయి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మరణాలకు గుండెపోటు ప్రధాన కారణంగా ఉంది. కావున తీవ్రమైన గుండె జబ్బులను మనం చాలావరకు నివారించవచ్చంటున్నారు నిపుణులు. అయితే.. ఆ రకంగా చర్యలు తీసుకోవడం అవసరం అంటున్నారు. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి హాని కలిగించే పనులను మానుకోవాలని సూచిస్తున్నారు. రోజువారీ జీవితంలో గుండెకు ఏది హానికరం.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. హార్ట్ ఎటాక్‌లకు కారణమయ్యే విషయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కారణాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి
స్లీప్ డిజార్డర్: చాలా మంది ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆరోగ్యకరంగా ఉండాలంటే.. రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకపోతే.. అనేక సమస్యలకు దారి తీస్తుంది. వాటిలో ఒకటి గుండెపోటు. నిద్రలేమి కారణంగా, రక్తపోటు పెరగడం ప్రారంభమవుతుంది, ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.
కాలుష్యం: గత కొన్ని దశాబ్దాలుగా చిన్న, పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మెట్రో నగరాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా దారుణంగా మారింది. అటువంటి పరిస్థితిలో శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటుంది. దీంతో గుండె క్రమంగా బలహీనపడటం ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో ఈ సమస్య గుండెపోటుగా మారుతుంది.
అధిక కొలెస్ట్రాల్: భారతదేశంలో ఆయిల్ ఫుడ్ తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీని కారణంగా మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరడం ప్రారంభమవుతుంది. ఇది క్రమంగా ధమనులలో అడ్డంకిని సృష్టిస్తుంది. దీని కారణంగా మన రక్తపోటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే రక్తం గుండెకు చేరుకోవాలో.. ఆ సమయంలో అంతరాయం కలిగితే.. గుండెపోటుకు దారితీస్తుంది.
ప్రాసెస్డ్ మీట్: ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ అభివృద్ధి కారణంగా.. మాంసం ఇప్పుడు చాలా కాలం పాటు కుళ్ళిపోకుండా కాపాడుతుంది. అయితే మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన మాంసం తరచుగా వేడిగా ప్రాసెస్ చేస్తారు. ఇది గుండెకు అస్సలు మంచిది కాదు. దానిని నివారించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..