AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cream Day: ఐస్‌క్రీమ్‌ తింటే ఇన్ని లాభాలున్నాయా.? నేడు ఐస్‌క్రీమ్‌ డే అనే విషయం మీకు తెలుసా..

Ice Cream Day 2022: చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఇష్టపడే ఆహార పదార్థం ఐస్‌క్రీమ్‌. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఐస్‌క్రీమ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి...

Ice Cream Day: ఐస్‌క్రీమ్‌ తింటే ఇన్ని లాభాలున్నాయా.? నేడు ఐస్‌క్రీమ్‌ డే అనే విషయం మీకు తెలుసా..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 17, 2022 | 6:35 AM

Ice Cream Day 2022: చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఇష్టపడే ఆహార పదార్థం ఐస్‌క్రీమ్‌. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఐస్‌క్రీమ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. పుల్ల ఐస్‌ నుంచి నేడు క్రీమ్‌ స్టోన్‌ ఐస్‌క్రీమ్‌కు అప్‌డేట్‌ అయినా ఐస్‌క్రీమ్‌కు ఉన్న క్రేజ్‌మాత్రం అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉంది. ఐస్‌క్రీమ్‌ తింటే జలుబు చేస్తుందని తెలిసినా దీని రుచి మాత్రం తినకుండా ఆపలేదు. అంతలా ఐస్‌క్రీమ్‌ మన ఆహారంలో ఒక భాగమైపోయింది.

అమెరికాలో ప్రతీ ఏటా జూలై మూడో వారంలో తొలి ఆదివారాన్ని నేషనల్‌ ఐస్‌క్రీమ్‌ డేగా నిర్వహిస్తారనే విషయం మీకు తెలుసా.? ఎప్పటిలాగే ఈరోజు కూడా అమెరికన్‌లు ఐస్‌క్రీమ్‌ దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరి ఐస్‌ క్రీమ్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొన్ని లాభాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా.? ఇంతకీ ఐస్‌క్రీమ్‌తో కలిగే ఆ లాభాలేంటంటే..

* ఐస్‌క్రీమ్‌లు శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్‌తో నీరసించిన బాడీకి ఐస్‌క్రీమ్‌లు అప్పటికప్పుడు శక్తిని అందిస్తాయి. తక్కువ ఫ్యాట్‌ మిల్క్‌ ఉన్న ఐస్‌క్రీమ్‌ను పెద్దవారికి మేలు చేస్తాయి. కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి తక్షణం కావాల్సిన శక్తిని ఇస్తాయి.

* డైరీ ప్రొడెక్ట్స్‌లో సహజంగానే ప్రోటీన్స్‌ అధికంగా ఉంటాయి. పాలతో తయారయ్యే ఐస్‌క్రీమ్స్‌ ద్వారా శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి.

* పాలలో ఉండే కాల్షియం, జింక్‌, పొటాషియం, ఐయోడిన్‌, పాస్పరస్‌, విటమిన్‌ ఏ, బి కాంప్లెక్స్‌లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కెమికల్స్‌ ఎక్కువ లేని కేవలం స్వచ్ఛమైన పాలతో తయారు చేసే ఐస్‌క్రీమ్స్‌ వల్ల ఈ లాభాలు ఉంటాయి.

* కొన్ని రకాల ఐస్‌క్రీమ్‌లను బెర్రీలు, ద్రాక్ష, పైనాపిల్‌ వంటి రకరకాల ఫ్లేవర్స్‌లలో తయారు చేస్తారు. ఇలాంటివి ఐస్‌క్రీమ్‌లను కేవలం రుచిగానే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే వాటిగా కూడా మార్చేస్తాయి. డార్క్‌ చాక్లెట్‌ ఐస్‌క్రీమ్‌లు కూడా మేలు చేస్తాయి.

* ఐస్‌క్రీమ్‌లు తినడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే రసాయనం సెరోటోనిన్‌ను విడుదల చేస్తుంది. దీనిని హ్యాపీ హార్మోన్‌గా పిలుస్తారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం సొంతమవుతుంది.

నోట్‌: ఐస్‌క్రీమ్‌ వల్ల లాభాలు ఉన్నాయనే విషయం నిజమే అయినప్పటికీ. తీసుకునే ఫ్లేవర్‌పై ఆధారపడి ఉంటుంది. అలాగే అతి ఏదైనా చేటు చేస్తుందన్నట్లు మోతాదుకు మించి తింటే అనారోగ్యం బారిన పడే అవకాశం కూడా ఉంది. అలాగే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండడమే మంచిది. కాబట్టి ఐస్‌క్రీమ్‌ తినే ముందు వైద్యులు సూచన తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..