AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay-Rashmika: విజయ్-రష్మిక జోడీతో మాన్యవర్ వెడ్డింగ్ క్యాంపెయిన్ వీడియో.. 72 గంటల్లోనే 300 మిలియన్ల వ్యూస్

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల వివాహం జరిగి పది రోజులు పూర్తయ్యాయి. కొత్త దంపతులు అప్పుడే తమ సినిమా పనుల్లోనూ మునిగిపోయారు. అయినా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విరోష్ జంట పెళ్లి ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి.

Vijay-Rashmika: విజయ్-రష్మిక జోడీతో మాన్యవర్ వెడ్డింగ్ క్యాంపెయిన్ వీడియో.. 72 గంటల్లోనే 300 మిలియన్ల వ్యూస్
Vijay And Rashmika
Basha Shek
|

Updated on: Mar 09, 2026 | 6:13 PM

Share

ప్రముఖ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ మాన్యవర్ మోహె ఇటీవల సరికొత్త క్యాంపెయిన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రానున్న వెడ్డింగ్ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా లతో ఒక క్యాంపెయిన్‌ను రూపొందించింది. రష్మిక అండ్ విజయ్.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో ప్రచార్ కమ్యూనికేషన్ క్రియేట్ చేసిన ఈ క్యాంపెయిన్‌కు ఇప్పుడు డిజిటల్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లపై సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.  ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన మూడు రోజుల్లోనే రష్మిక మందన్నాతో విజయదేవరకొండ కలిసి ఉన్న స్టిల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే దాదాపు 8 మిలియన్ల ఆర్గానిక్ లైక్స్ నమోదయ్యాయి. ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ లోనూ కలిపి ఇప్పటివరకు 300 మిలియన్లకు పైగా వ్యూస్, 250 మిలియన్ల యూజర్లను చేరుకుంది. ఇక పోస్టు ఎంగేజ్‌మెంట్ విషయానికొస్తే 4 లక్షలకు పైగా షేర్లు, 65 వేల రీపోస్టులు, 29,500కుపైగా కామెంట్లు వచ్చాయి. ఈ మేరకు ప్రచార్ కమ్యూనికేషన్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

కాగా ప్రస్తుతానికి కేవలం డిజిటల్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మాత్రమే ఈ రష్మిక అండ్ విజయ్.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ క్యాంపెయిన్ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే సినిమా థియేటర్లు, ప్రింట్, అవుట్ డోర్ మీడియాలకు కూడా ఈ క్యాంపెయిన్ ను విస్తరిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రచార్ కమ్యూనికేషన్ డైరెక్టర్ రక్షిత్ జైన్ మాట్లాడుతూ.. ‘కేవలం మూడు రోజుల్లోనే ఇలాంటి క్యాంపెయిన్‌కు ఆలోచన చేసి పూర్తి చేయడం, దానికి అనూహ్యమైన స్పందన రావడంపై ఆనందంగా ఉంది. మాన్యవర్‌తో మాకు దశాబ్దకాలంగా ఉన్న సంబంధం వల్లే ఇంత వేగంగా పూర్తి చేయగలిగాం. విజయ్ దేవరకొండ, రష్మిక జంటకు మేం ఊహించిన దానికంటే రెస్పాన్స్ చాలా ఎక్కువగా వచ్చింది’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

విజయ్- రష్మికల మాన్యవర్ వెడ్డింగ్ క్యాంపెయిన్ వీడియో..

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు మాట్లాడుతూ.. మాన్యవర్ మోహె బ్రాండ్ వివాహాలను ఎమోషన్స్ తో చూపించే విధానం చాలా ప్రత్యేకం. ఈ వివాహ కలెక్షన్‌లోని దుస్తులు అందంగా ఉండటంతో పాటు అద్భుతమైన నైపుణ్యాన్ని చూపిస్తున్నాయి. కాన్సెప్ట్, సంగీతం, దుస్తులు అన్ని కలిసి ఆధునికతతో పాటు సంప్రదాయాన్ని ఈ క్యాంపెయిన్ ప్రతిబింబిస్తోందన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!