AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుచ్చ‌కాయ కొనేటప్పుడు ఈ ఒక్క గుర్తు చూసి కొనండి.. లేదంటే మీ ఆరోగ్యం హరి గోవిందా..!

మార్కెట్‌లో లభించే పుచ్చకాయలు నిజంగా సహజంగా పండినవేనా? లేకపోతే రసాయనాలతో పండించబడినవా? మీ కుటుంబం ఆరోగ్యంగా సురక్షితంగా ఉంచుకోవటం కోసం పుచ్చకాయను కొనేటప్పుడు, తినేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. పుచ్చకాయ కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటంటే...

పుచ్చ‌కాయ కొనేటప్పుడు ఈ ఒక్క గుర్తు చూసి కొనండి.. లేదంటే మీ ఆరోగ్యం హరి గోవిందా..!
Perfect Watermelon
Jyothi Gadda
|

Updated on: Mar 09, 2026 | 5:20 PM

Share

ఎండాకాలం వచ్చేసరికి మార్కెట్‌లో ఎక్కువగా కనిపించే పండు పుచ్చకాయ. ఈ జ్యూసి, రుచికరమైన పుచ్చకాయలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. చల్లగా, తియ్యగా ఉండే పుచ్చకాయ తింటే శరీరానికి తక్షణం శక్తి, తేజస్సు వస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. మార్కెట్‌లో లభించే పుచ్చకాయలు నిజంగా సహజంగా పండినవేనా? లేకపోతే రసాయనాలతో పండించబడినవా? మీ కుటుంబం ఆరోగ్యంగా సురక్షితంగా ఉంచుకోవటం కోసం పుచ్చకాయను కొనేటప్పుడు, తినేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. పుచ్చకాయ కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటంటే…

వేసవిలో శరీరంలోని నీటి స్థాయిని నిర్వహించడానికి పుచ్చకాయ సరైన ఫ్రూట్‌. అయితే, కృత్రిమంగా పెంచిన, రసాయనికంగా చికిత్స చేయబడిన పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కూడా జరగవచ్చు. కాబట్టి, పుచ్చకాయను ఎంచుకునేటప్పుడు, ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోండి.

ముందుగా, పుచ్చకాయ పరిమాణాన్ని గమనించాలి. చాలా పెద్దగా లేదా అసహజంగా మెరిసే పుచ్చకాయలను కొనకపోవడం మంచిది. సాధారణంగా సహజంగా పెరిగిన పుచ్చకాయలు మోస్తరు పరిమాణంలో ఉంటాయి. అలాగే పండు మీద చిన్న చిన్న గీతలు లేదా సహజమైన చర్మపు మచ్చలు కనిపిస్తే అది సహజంగా పండినదని అర్థం.

ఇవి కూడా చదవండి

మరో ముఖ్యమైన విషయం పుచ్చకాయ రంగు. మంచి పుచ్చకాయకు గాఢమైన ఆకుపచ్చ రంగు ఉంటుంది. పండు ఒక వైపు పసుపు లేదా క్రీమ్ రంగులో ఉండే మచ్చ కనిపిస్తే అది నేలపై పండిన గుర్తు. ఈ మచ్చను ఫీల్డ్ స్పాట్ అంటారు. ఈ మచ్చ స్పష్టంగా ఉంటే ఆ పండు సహజంగా పండిందని భావించవచ్చు.

మరొక సులభమైన పరీక్ష పుచ్చకాయను చేతులతో తట్టి చెక్‌ చేయటం. పుచ్చకాయను చేతితో తట్టినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్టు గంభీరమైన శబ్దం వస్తే అది బాగా పండినదని అర్థం. అయితే ముదురు లేదా బలహీనమైన శబ్దం వస్తే ఆ పండు ఇంకా పండకపోయి ఉండవచ్చు. అలాగే, పుచ్చకాయ బరువు కూడా చాలా ముఖ్యం. ఒకే పరిమాణంలో ఉన్న పండ్లలో ఎక్కువ బరువుగా అనిపించే పండును ఎంచుకోవాలి. ఎందుకంటే అది లోపల నీరు, తీపి ఎక్కువగా ఉండే అవకాశముంది.

అలాగే, ఈ పండు పైభాగంలో ఉండే కాడ కూడా ఒక సంకేతం ఇస్తుంది. కాడ పూర్తిగా ఎండిపోయి గోధుమ రంగులో ఉంటే అది సహజంగా పండిన పుచ్చకాయ. అయితే కాడ ఇంకా పచ్చగా ఉంటే అది పూర్తిగా పండక ముందే కోసిన పండు కావచ్చు.

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను గుర్తుంచుకుంటే మార్కెట్‌లో తీయ్యగా, రసాయనాలు లేని మంచి పుచ్చకాయను సులభంగా ఎంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం కోసం సహజంగా పండిన పండ్లను ఎంచుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కాళ్ళ వాపులతో నిద్ర పట్టడం లేదా తింటే రాత్రికే రాత్రే ఊహించని..
కాళ్ళ వాపులతో నిద్ర పట్టడం లేదా తింటే రాత్రికే రాత్రే ఊహించని..
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
గులాబీలు గుత్తులుగా పూయాలా? ఈ 6 నియమాలు పాటిస్తే పూల వర్షమే
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్.. ఈ జిల్లాలకు..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
మీ కళ్లను కాపాడుకోవాలంటే వీటిని తినండి..
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు చెక్.. వారందరికీ రేపు స్కిల్ టెస్ట్!
90 కాలంనాటి వినాయక చవితి మధుర జ్ఞాపకాలు.. హార్ట్ టచింగ్ స్టోరీ
90 కాలంనాటి వినాయక చవితి మధుర జ్ఞాపకాలు.. హార్ట్ టచింగ్ స్టోరీ
50 ఏళ్లు నిండినవారికి పింఛన్లు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
50 ఏళ్లు నిండినవారికి పింఛన్లు.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
వైభవ్ సూరవంశీ టెస్ట్ క్రికెట్‌లో రాణించలేడా?
వైభవ్ సూరవంశీ టెస్ట్ క్రికెట్‌లో రాణించలేడా?