AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. కన్నీరు పెట్టిస్తున్న టమాటా.. కిలో ధర ఇంత తక్కువనా?

టమోటా ధర రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టమంతా వృధా అయ్యిందంటూ, బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల కిలో టమాటా ధర రూ.5 ఉంది. ఒక్క టమాటా బాక్స్ ధర 40 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక రైతులు టమాటాలను పశువులకు మేతగా వేస్తున్నారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 6:12 PM

Share
ఆరు గాలం కష్టపడి పండించిన టమోటా పంట చేతికొచ్చింది. కానీ గిట్టుబాటు ధర లేకపోవడంతో వాటిని మార్కెట్లకు తీసుకెళ్లడం కూడా దండగే అనుకున్నారు. ఇంకేముంది పండించిన చేనులోనే పంటను, వదిలేస్తూ, టమోటాలను రోడ్డు పై వేస్తూ పశువులకు మేతగా వేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

1 / 5
కర్నూలు జిల్లా గోనెగొండ్లకు చెందిన మున్సిస్వామి అనే రైతు తన ఎకరా పొలంలో ఎన్నో ఆశలు పెట్టుకొని టమోటా వేసి పంటను సాగుచేసాడు. పంట బాగా పండింది, టమోటాను మార్కెట్ కు వెళ్లి అమ్ముకుంటాం అనే లోపే టమోటా ధర పతనమైంది.

2 / 5
ఒక రోజు పంటను కూలీలను పెట్టి కొస్తే సుమారు మూడు వందల బాక్స్ లు టమోటాలు వస్తాయి. వాటిని అమ్ముకునేందుకు మార్కెట్ కు వెళ్ళాలి అంటే ఒక బాక్స్ రూ.50 రవాణా ఖర్చు అవుతుండగా, మార్కెట్ లో అదే టమోటా బాక్స్ రూ. 40 కొంటూ ఉంటే తాము ఎలా అమ్ముకోవాలి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

3 / 5
అటు రవాణా ఖర్చు, ఇటు పెట్టుబడులు రాక, చేతికి వచ్చిన టమోటా పంటను పొలంలోనే పారబోసి, మూగ జీవాలకు దానగా వేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.80 వేలు ఖర్చు చేస్తే, కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

4 / 5
టమాటా కేజీకి ఒక్క రూపాయి కూడా రైతులకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండిన పంటను కనీసం కొనేవారే కరువయ్యారని వాపోతున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టమోటా కు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

5 / 5
Follow Us
'విరోష్' మాన్యవర్ వెడ్డింగ్ క్యాంపెయిన్ కు సూపర్బ్ రెస్పాన్స్..

వరల్డ్ కప్ ప్రైజ్ మనీ లిస్ట్ వచ్చేసింది
వరల్డ్ కప్ ప్రైజ్ మనీ లిస్ట్ వచ్చేసింది
అయ్యో.. కన్నీరు పెట్టిస్తున్న టమాటా.. కిలో ధర ఇంత తక్కువనా?
అయ్యో.. కన్నీరు పెట్టిస్తున్న టమాటా.. కిలో ధర ఇంత తక్కువనా?
ఉగాది వచ్చేస్తోంది.. శ్రీశైలంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?

వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు వెనుక ఇంత ఉందా? ఎంత డేంజరో తెలిస్తే

రిస్క్ తీసుకుంటే సక్సస్ పక్కా.. వీరికి ఊహించని అదృష్టం..!

మధ్యాహ్న భోజనంలో గుడ్డు తినబోయిన విద్యార్ధి.. పొట్టు తీయగా

మార్చి 31లోపు డబ్బులు కట్టకపోతే పెనాల్టీ..

ఇక ఒలింపిక్స్ గోల్డే మా టార్గెట్.. కెప్టెన్ సూర్య సంచలన ప్రకటన

దేవుడా.. బంగారం అంత పెరుగుతుందా.. నోస్ట్రాడమస్ జోస్యంతో ప్రపంచం..