Bone Health: ఈ అలవాట్లు ఉంటే ఎముకలు బలహీనమవుతాయి.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

35 నుంచి 40 సంవత్సరాల వయస్సు తర్వాత శరీరంలో కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలోని ఎముకలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

Bone Health: ఈ అలవాట్లు ఉంటే ఎముకలు బలహీనమవుతాయి.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..
Bone Health Care
Follow us

|

Updated on: Jul 17, 2022 | 1:39 PM

Weak Bones Reasons: మన శరీరాన్ని బలంగా ఉంచుకోవాలంటే, ఎముకలు దృఢంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, వయస్సు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఎందుకంటే 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు తర్వాత శరీరంలో కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలోని ఎముకలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎముకలు, దంతాలు క్రమంగా బలహీనపడుతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో క్యాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ఉండాలి. అప్పుడే శరీర నొప్పులు, ఎముకలు బలహీనంగా మారకుండా కాపాడుకోవచ్చు. ఎముకలు బలహీనపడటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ అలవాట్లతో ఎముకలు బలహీనమవుతాయి

  • తరచుగా రెడ్ మీట్ ఎక్కువగా తినేవారిలో వారి శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొటీన్లు అందడం మొదలవుతుంది. దాని వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. విసర్జన సమయంలో చాలా కాల్షియం శరీరం నుంచి బయటకు వస్తుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
  • శీతల పానీయాలు, సోడా వంటి కార్బోనేటేడ్ పానీయాలను ఎక్కువగా తీసుకునే వ్యక్తులు వీక్ బోన్ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటువంటి పానీయాలలో కాల్షియం తగ్గించే ఎక్కువ ఫాస్ఫేట్ ఉంటుంది. శీతల పానీయాలతో ఎముకలు క్రమంగా బలహీనపడతాయి.
  • కొందరు ఎసిడిటీ మందులను ఎక్కువగా తీసుకుంటారు. వారు దానిని ఆపితే మంచిదంటున్నారు నిపుణులు. ఈ మందులు కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
  • ఎముకలను దృఢంగా ఉంచుకోవాలనుకుంటే టీ-కాఫీని తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే అందులో ఉండే క్యాపిన్ ఎముకలపై ప్రభావం చూపుతుంది. అలాంటి వారికి కెఫిన్ ముప్పుగా మారుతుంది.

ఎముకలను బలోపేతం చేయడానికి మార్గాలు

ఇవి కూడా చదవండి
  • కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉన్న పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్‌ మంచిది.
  • స్వీ్ట్లు, పంచదారను నియంత్రించుకోవడం మంచిది. చక్కెరకు బదులుగా బెల్లం తినడం ప్రారంభించండి. తద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్ రెండూ అందుతాయి.
  • పాలు, పాల ఉత్పత్తులను తినకపోతే.. ఇక నుంచి వాటిని తీసుకోవడం ప్రారంభించండి. పాలు కాకుండా పెరుగు, జున్ను తినడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
  • ఎముకలు దృఢంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు తినాలి. ముఖ్యంగా బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోండి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..