Health Care: మీరు రోజంతా వేడి నీటిని తాగుతున్నారా..? సమస్యల్లో చిక్కుకున్నట్లే..!
Health Care: ఈ రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఏదో ఒక రకంగా జబ్బుల బారిన పడుతున్నారు. ఇకపోతే గోరువెచ్చని..
Health Care: ఈ రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఏదో ఒక రకంగా జబ్బుల బారిన పడుతున్నారు. ఇకపోతే గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికి తెలిసిందే. ఉదయాన్నే గోరువెచ్చని తీసుకుంటే వివిధ రకాల వ్యాధులను నయం చేస్తుందని పరిశోధకులు నిరూపించారు. అయితే గోరువెచ్చని నీటిని రోజంతా తీసుకుంటే నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. చాలా మంది ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రోజంతా వేడి నీటిని తాగుతారు. దాని వల్ల ఉన్న ప్రయోజనాలు ఉన్నా.. అధికంగా తీసుకుంటే నష్టాలు కూడా చాలా ఉన్నాయంటున్నారు.
రక్తంలో నీరు: మీరు బరువు తగ్గడానికి లేదా పొట్ట తగ్గడానికి రోజంతా వేడి నీటిని తాగితే ఈ అలవాటును మార్చుకోండని సూచిస్తున్నారు నిపుణులు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా చేయడం వల్ల రక్తంలో నీటి పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది.
కిడ్నీ: ఇది మన శరీరంలోని ముఖ్యమైన భాగం కిడ్నీ. ఇది టాక్సిన్స్‌ను తొలగించడానికి పనిచేస్తుంది. దీని సామర్థ్యం కొంత వరకు నీటిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఎక్కువ వేడి నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
నిద్రలేమి: రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నిరంతరం వేడి నీటిని తీసుకుంటే మీకు నిద్రలేమి సమస్య ఉండవచ్చు. నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా తరచుగా మూత్ర విసర్జన సమస్యలు వస్తాయి.
వాపు సిరలు: మీకు దాహం వేయకపోతే, మీరు ఇప్పటికీ వేడి నీటిని తాగుతూ ఉంటే అప్పుడు మీరు సిరల్లో వాపు సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దీంతో మెదడులోని నరాల్లో వాపు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల, రోజులో పరిమిత పరిమాణంలో మాత్రమే గోరు వెచ్చని నీటిని తాగాలి.