AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!

మారుతున్న లైఫ్‌స్టైల్, వర్క్ ప్రెజర్ కారణంగా జనాలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో జ్ఞాపకశక్తి మందగించడం, మతిమరుపు కూడా ఒకటి. ఈ సమస్యలను పరిష్కరించుకొని బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా చేసుకోవాలంటే మన రోజువారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన ప్రఖ్యాత న్యూరో సైంటిస్ట్ దయా గ్రాంట్ చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

బ్రెయిన్ సూపర్ యాక్టీవ్‌గా పనిచేయాలా?.. అయితే న్యూరో సైంటిస్ట్ చెప్పిన ఈ 3 ట్రిక్స్ ట్రై చేయండి!
Brain Health Tips
Anand T
|

Updated on: Mar 09, 2026 | 7:33 PM

Share

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో జనాలు రోజు మొత్తం టెన్షన్, పని ఒత్తిడితోనే గడపుతున్నారు. దీనికి తోడు రోజంతా ఫోన్‌ వాడడం, ఇలా అనేక రకాల పనులతో మన బ్రెయిన్‌కు రెస్ట్ లేకుండా చేస్తున్నారు. దీని వల్ల మతిమరుపు, జ్ఞానపశక్తి మందగించడం, లోచించే శక్తి లోపించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అదిగమించేందుకు జనాలు అనేక రకాల మందులను వాడుతూ ఉంటారు. కానీ మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈజీగా మన బ్రెయిన్‌ను సూపర్ యాక్టీవ్‌గా మార్చుకోవచ్చని న్యూరో సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఈ అలవాట్లు మన బ్రెయిన్‌ను ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండేలా చేస్తాయి అంటున్నారు.

మీ మెదడు పనితీరును మెరుగుపరిచే అలవాట్ల ఇవే

మెదడుకు ఫ్రీటైం: న్యూరో సైంటిస్ట్ ప్రకారం రోజంతా మనం పనిలో మునిగిపోవడం, ఫోన్‌లో గడపం వల్ల మన బ్రెయిన్‌పై ఒత్తిడి పెరుగుతుందని.. కాబట్టి దానికి కాస్తా ఫ్రీటైం ఇచ్చేందుకు ప్రతి రోజూ కొద్ది సమయం ప్రకృతిలో గడపాలని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఇది మెదడు ప్రశాంతత దొరికి తనను తాను రీసెట్ చేసుకుంటుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ మీ బ్రెయిన్‌లో కొత్త ఆలోచనలకు సహకరిస్తుందని, అలాగే రోజంతా మీ బ్రయిన్‌ను యాక్టీవ్‌గా ఉంచుతుందని చెబుతున్నారు.

స్కిల్స్ పెంచుకోవడం, పజిల్స్ పరిష్కరించడం: మీ బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేయాలి అంటే మీరు ఎప్పుడూ ఫోన్‌ పట్టుకొని కూర్చోవడం కాకుండా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఫజిల్‌లను పరిష్కరించడం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే పియానో వంటి వాటిని నేర్చుకోవాలని సూచిస్తున్నారు. సంగీత వాయిద్యాలను వాయించడం వల్ల మెదడు జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు.

ప్రాణాయామం: పని మధ్యలో మానసికంగా అలసిపోయినప్పుడు నాడి శోధన ప్రాణాయామం చేయాలని చూసిస్తున్నారు. ఇందుకోసం ప్రశాంతమైన ప్లేస్‌లో కూర్చొని ఒక ముక్కు రంధ్రాన్ని మూసివేసి, మరొక ముక్కు ద్వారా కొన్ని నిమిషాలు గాలి పీల్చు్కోవాలని చెబుతున్నారు. ఈ సాధారణ చర్య మీ ఏకాగ్రతను పెంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరో సైంటిస్ట్ చెప్పినట్లుగా, మెదడుకు ఎక్కువ పని చేయడం కంటే కొంత విశ్రాంతి మరియు సరైన అలవాట్లను ఇవ్వడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ మీ కోసం కొంత సమయం కేటాయించండి, ప్రాణాయామం చేయండి మరియు పాత అలవాట్లకు తిరిగి వెళ్లండి. అప్పుడే మీ మెదడు పదునుగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us