Gas Booking: గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. కేంద్రం నుంచి బిగ్ డెసిషన్.. బుకింగ్‌కు కొత్త రూల్స్..
గ్యాస్ నిల్వలు దేశంలో తగ్గుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశంలో కొరత ఏర్పడటం వల్ల గ్యాస్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.60 మేర పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు కంపెనీలు.

గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. వారిని ప్రభావితం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ రూల్స్‌ను పూర్తిగా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ వినియోగదారులందరూ ఈ కొత్త నిబంధన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరముంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొరత ఏర్పడకుండా చర్యలు చేపడుతోంది. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా కేంద్రం కొన్ని నిబంధనలను అమలు చేస్తోంది. తదుపరి ఆదేశాల వరకు ఈ రూల్స్ వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
25 రోజుల తర్వాత బుకింగ్
గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కేంద్ర తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి గ్యాస్ బుక్ చేసుకున్న 25 రోజుల తర్వాతనే మరో గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొన్నటివరకు 21 రోజులగా ఉండగా.. ఇప్పుడు ఈ టైమ్ పిరియడ్‌ను 25 రోజులకు పెంచింది. నిల్వలు పెంచేందుకు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్పీజీ సిలిండర్ల ఉత్పత్తిని పెంచేందుకు గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర సర్కార్.. వాణిన్య కనెక్షన్ల కంటే గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. గతంలో 55 రోజుల్లో సిలిండర్‌ను బుక్ చేసుకునే వ్యక్తులు 15 రోజుల్లో సిలిండర్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలు విధించింది.
పెరిగిన ముడి చమురు ధరలు
అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. వీటి ధరలు త్వరలో బ్యారెల్‌కు 130 డాలర్లకు పెరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ మార్గంలోనే ముడి చమురు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పుడు అది మూతపడటంతో ముడి చమురు రవాణా సగానికి సగం తగ్గిపోయింది. దీంతో ముడి చమురు ధరలు పెరగడం వల్ల గ్యాస్ ధరలు కూడా దేశంలో పెరిగాయి. ఇటీవల డొమెస్టిక్ గ్యాస్ ధరలను రూ.60 మేర కేంద్రం పెంచగా.. వాణిజ్య సిలిండర్ ధరను రూ.110 మేర పెంచింది. దీంతో గ్యాస్ వినియోగదారులపై గుది బండ పడినట్లు అయింది. అయితే త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే భారత్‌తో ఇంధన నిల్వలు ఉన్నందున వాటి ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్రం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. యుద్దం ఎక్కువ రోజులు కొనసాగితే పెట్రోల్ ధరలు పెరిగే అవకాశముంది.
