AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ రూట్ ఫిక్స్..

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఏపీ, తెలంగాణలో మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. మార్చి 11న ఈ రైలు ప్రారంభం కానుందని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. దాదాపు ఆ రోజు నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. మార్చి 11 నుంచి పరుగులు.. ఈ  రూట్ ఫిక్స్..
Amrit Bharat Express
Venkatrao Lella
|

Updated on: Mar 09, 2026 | 6:39 PM

Share

తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల గుండా పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం సౌకర్యం అందించేందుకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ మీదుగా తమిళనాడుకు ఇది వెళ్తుంది. దీని వల్ల సరమైన రైలు కనెక్టివిటీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ స్టేషన్ల మధ్య ప్రయాణం

త్వరలో తెలుగు రాష్ట్రాలకు కొత్త అమృత్ భారత్ రైలు రానుంది. నాగర్ కోయిల్-చర్లపల్లి మధ్య ఈ రైలును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రైల్లో సూపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. దూర ప్రయాణికులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ట్రైన్ ప్రవేశపెడుతున్నారు. మూడు రాష్ట్రాలను ఈ రైలు కలుపుతుంది. దీంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ ప్రజలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ లభించనుంది. త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుండగా.. షెడ్యూల్, స్టాప్ వివరాలు ప్రారంభం తేదీకి ముందు ప్రకటించనున్నారు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించేవారికి సులభతర ప్రయాణాన్ని అందిస్తుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఇక చర్లపల్లి నుంచి రైలు కనెక్టివిటీని పంచనుంది.

మార్చి 11న ప్రారంభం

మార్చి 11న ఈ రైలును ప్రారంభించనున్నారని తెలుస్తోంది. చర్లపల్లి నుంచి బయల్దేరే ఈ రైలు… నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. కాట్పాడి, జోలార్ పేట్, సేలం, ఈ రోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఎర్నాకుకలం, కొట్టాయం, కొల్లాం మీదుగా తమిళనాడుకు చేరుకుంటుంది. 1500 కిలోమీటర్ల మేర ప్రయాణించే ఈ రైలు.. 30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇక ఈ రైలులో బయో టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, ఛార్జింగ్ పాయింట్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముజఫర్‌పూర్‌, తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇది కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి మూడు రైళ్లు వెళ్లినట్లు అవుతుంది. సామాన్యుల కోసం ఈ రైళ్లను తీసుకొస్తున్నారు. నాన్ ఏసీ ప్రయాణికుల కోసం వీటిని ప్రవేశపెడుతున్నారు. తక్కువ ధరలో బెస్ట్ జర్నీ వీటిల్లో చేయవచ్చు. దీంతో ఈ రైళ్లకు డిమాండ్ ఎక్కవగా ఉంటుంది.

Follow Us