AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Prices: పడిపోయిన కోడి గుడ్ల ధరలు.. ఒక్కసారిగా ధరలు పతనం.. ఇప్పుడు ఎంతంటే..?

దేశంలో కోడి గుడ్ల ధరలు తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల ఎగ్ ఎగుమతులు ఆగిపోయాయి. దీని వల్ల దేఇశంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. మరికొన్ని రోజుల పాటు ఇలాగే పరిస్థితి కొనసాగే అవకాశముందని పాల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఒక్కొ గుడ్డు ధర ఎంత ఉందంటే..?

Egg Prices: పడిపోయిన కోడి గుడ్ల ధరలు.. ఒక్కసారిగా ధరలు పతనం.. ఇప్పుడు ఎంతంటే..?
Eggs
Venkatrao Lella
|

Updated on: Mar 09, 2026 | 7:06 PM

Share

కోడి గుడ్లు తినేవారికి శుభవార్త. గుడ్ల ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ద ప్రభావం పాల్ట్రీ పరిశ్రమపై పడింది. యుద్దం కారణంగా భారత్ నుంచి విదేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో రవాణా చేయడం కష్టంగా మారడం వల్ల సరఫరా నిలిచిపోయంది. దీని వల్ల భారత్‌లో గుడ్ల నిల్వలు ఎక్కువగా ఉండటంతో ధరలు పడిపోయాయి. రోజురోజుకి గుడ్ల ధరలు తగ్గుతూ వస్తోండటంతో సామాన్యులకు ఊరట కలుగుతోంది. అయితే పాల్ట్రీ రైతులు మాత్రం దీని వల్ల నష్టపోతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా గుడ్ల వినియోగం తక్కువగా ఉండటంతో ధరలు పతనమవుతున్నాయి.

ఒక్కో గుడ్డు ఎంతంటే..?

ప్రస్తుతం ఒక్కొ గుడ్డు ధర రూ.5 పలుకుతోంది. నెక్ ధరల ప్రకారం మార్చి 1న రూ.4.58గా ఉండగా.. వారం రోజుల్లో 0.33 పైసలు తగ్గింది. దీంతో ప్రస్తుతం రూ.4.25గా ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.5కి విక్రయిస్తున్నారు. వేసవి కాలం వస్తుండటం, ఎగుమతులు నిలిచిపోవడమే ధరల తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు. ప్రతీ ఏటా సమ్మర్‌లో ఎగ్ ధరలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఈ సారి కూడా అదే విధంగా ధరలు పతనమవుతూ వస్తోన్నాయి. వినియోగదారులకు తక్కువ ధరకే లభిస్తుండగా.. పాల్ట్రీ రైతులు మాత్రమే నష్టపోతున్నాయి. మేత ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు పెరగ్గా.. మార్కెట్లో ధరలు తక్కువగా ఉండటం వల్ల నష్టపోతున్నారు.

ధరలు మరింత పతనం

కోడి గుడ్ల ధరలు మరింత తగ్గే అవకాశముందని పాల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది. ఇక రానున్న రోజుల్లో ఎండ ప్రభావం మరింత పెరగనుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో గుడ్ల ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. గత నెలలో కోడి గుడ్ల ధరలు పెరిగాయి. ఒక్కొ గుడ్డు ధర రూ.10కి కూడా చేరుకుంది. ఆ తర్వాత పండుగ సీజన్ ముగియడంతో ధరలు దిగొస్తున్నాయి. అటు యుద్ద ప్రభావంతో అరటి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో అరటి సాగు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే వాతావరణ పరిస్థితుల వల్ల నష్టపోయారు. అయితే ఇక్కడ నుంచి అరటి ఎక్కువగా గల్ప్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. కానీ గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అరటి ధరలు తగ్గుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us