కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్ గార్డెన్లో డూప్లెక్స్ అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఇదే ఏరియాలోనే ఉంటారు. ఇక తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్ట్‌లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ 14,369 SFTతో పెద్దగా విశాలంగా ఉంటుంది