డ‌యాబెటిస్ ఉన్నవారు స్ట్రాబెర్రీలు తిన‌వ‌చ్చా..?

09 March 2026

TV9 Telugu

TV9 Telugu

స్ట్రాబెర్రీల రంగు, రుచి, పరిమళం కార‌ణంగా వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అనేక డెజ‌ర్ట్‌ల‌ల్లో కూడా వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు

TV9 Telugu

స్ట్రాబెర్రీలు రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఆరోగ్యానిక మేలు చేసే పోష‌కాలు దండిగా ఉంటాయి. అయితే మ‌ధుమేహంతో బాధ‌ప‌డే వారు స్ట్రాబెర్రీల‌ను తీసుకోవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది

TV9 Telugu

మధుమేహంతో బాధ‌ప‌డే వారు ఆహారం తీసుకునే చిన్న పొర‌పాట్లు కూడా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతూ ఉంటాయి. అయితే వీరు స్ట్రాబెర్రీల‌ను తీసుకోవ‌చ్చని వైద్యులు చెబుతున్నారు

TV9 Telugu

వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ప్రీ డ‌యాబెటిస్ ఉన్న వారిలో ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలు మెరుగుప‌డ‌డంతో పాటు వాపును త‌గ్గించ‌డంలో కూడా ఇవి ఉప‌యోగ‌ప‌డతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

TV9 Telugu

12 వారాల పాటు పెద్ద క‌ప్పు స్ట్రాబెర్రీల‌ను తీసుకోవడం వ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్లు ల‌భించ‌డంతో పాటు ఆరోగ్యక‌ర‌మైన గ్లూకోజ్ ప్రతిస్పందనలు పొందొచ్చు. స్ట్రాబెర్రీల‌ను తరచూ తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి

TV9 Telugu

స్ట్రాబెర్రీలు పోష‌కాల‌ను క‌లిగి ఉండ‌డంతో పాటు త‌క్కువ గ్లైసెమిక్ సూచిక‌ను క‌లిగి ఉంటాయి. అందుకే ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల్లో వ‌చ్చే హెచ్చు త‌గ్గుల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి

TV9 Telugu

స్ట్రాబెర్రీల్లో విట‌మిన్ సి తో పాటు ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇవి చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది

TV9 Telugu

అలాగే స్ట్రాబెర్రీల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణక్రియ‌ను నెమ్మదిస్తుంది. దీంతో చ‌క్కెర స్థాయిలు ఒకేసారి పెర‌గ‌కుండా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. వీటిల్లోని పోషకాలు భ‌విష్యత్తులో డ‌యాబెటిస్ బారిన ప‌డే అవ‌కాశాలను తగ్గిస్తాయి