AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎముకల ఆరోగ్యం కోసం.. గుడ్డు ఇలా తింటేనే విటమిన్-D లభిస్తుంది.. చాలామంది చేసే పెద్ద తప్పు!

చాలామంది గుడ్డు తెల్లసొన మాత్రమే తింటారు. కానీ విటమిన్-డి పచ్చసొనలో మాత్రమే ఉంటుంది. ఇది ఫ్యాట్ సాల్యూబుల్ కావడంతో, పూర్తి గ్రహింపు కోసం ఆరోగ్యకరమైన కొవ్వులున్న ఆవకాడో, గింజలు, చీజ్, ఆలివ్ ఆయిల్‌తో కలిపి తీసుకోవాలి. పోషకాలు నశించకుండా పచ్చసొన గట్టిపడకుండా వండటం ఉత్తమం. ఇలా చేయడం వల్ల గుడ్డులోని విటమిన్-డి పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.

ఎముకల ఆరోగ్యం కోసం.. గుడ్డు ఇలా తింటేనే విటమిన్-D లభిస్తుంది.. చాలామంది చేసే పెద్ద తప్పు!
Vitamin D Rich Foods
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 6:27 PM

Share

చాలామంది బరువు పెరుగుతామనే భయంతోనో లేదా కొలెస్ట్రాల్ పెరుగుతుందనే సాకుతోనో గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు. కానీ, విటమిన్-డి పొందాలనుకునే వారు చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఎందుకంటే.. గుడ్డులో ఉండే విటమిన్-డి మొత్తం పచ్చసొన లోనే ఉంటుంది. తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది,విటమిన్-డి సున్నా.విటమిన్-డి అనేది ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్. అంటే, ఇది మన శరీరంలో కరగాలన్నా, రక్తంలో కలవాలన్నా దీనికి కొవ్వు తోడుండాలి. అందుకే గుడ్డును ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉన్న ఆహారాలతో కలిపి తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

మీరు తినే గుడ్డులోని విటమిన్-డి వృథా కాకుండా ఉండాలంటే కొన్ని పదార్థాల తో కలిపి తీసుకంటే బెటర్ అని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఆవకాడో లో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ విటమిన్-డి గ్రహింపును పెంచుతాయి. గింజలు & విత్తనాలుగుడ్డుతో పాటు కొద్దిగా వాల్‌నట్స్ లేదా చియా సీడ్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

చీజ్ మితంగా చీజ్ జోడించడం వల్ల రుచితో పాటు ఫ్యాట్ కంటెంట్ పెరిగి విటమిన్ అబ్సార్ప్షన్ సులభమవుతుంది. ఆలివ్ ఆయిల్ గుడ్డును ఫ్రై చేసినా లేదా ఆమ్లెట్ వేసినా తక్కువ మోతాదులో ఆలివ్ ఆయిల్ వాడటం శ్రేయస్కరం.విటమిన్-డి ఎక్కువగా అందాలంటే గుడ్డును ఉడకబెట్టి తినడం కంటే, పచ్చసొన మరీ గట్టిపడకుండా వండుకుని తింటే పోషకాలు తక్కువగా నశిస్తాయి అని అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్