AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Alert: ఏటీఎం మెషీన్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా?.. ఈ పొరపాటు చేస్తే మీ డబ్బులు గోవిందా..

డిజిటల్ యుగంలో నగదు కోసం ఏటీఎంలే మనకు ప్రధాన ఆధారం. అయితే, కొన్నిసార్లు టెక్నికల్ లోపాల వల్ల లేదా సర్వర్ సమస్యల వల్ల మనం చొప్పించిన డెబిట్ కార్డు మెషీన్ లోపలే ఇరుక్కుపోతుంది. ఆ సమయంలో భయం వేయడం సహజం, కానీ ఆవేశంలో ఏటీఎం మెషీన్‌పై ప్రతాపం చూపడం వల్ల సమస్య పరిష్కారం కాదు సదా పెరుగుతుంది. అటువంటి అత్యవసర స్థితిలో మీ కార్డును, డబ్బును ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ATM Alert: ఏటీఎం మెషీన్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా?.. ఈ పొరపాటు చేస్తే మీ డబ్బులు గోవిందా..
Debit Card Stuck In Atm
Bhavani
|

Updated on: Mar 09, 2026 | 7:45 PM

Share

ఏటీఎం కార్డు ఇరుక్కుపోవడానికి కేవలం సాంకేతిక లోపాలే కాదు, భద్రతా కారణాలు కూడా ఉండవచ్చు. మీరు ఎక్కువ సమయం తీసుకోవడం లేదా వరుసగా తప్పు పిన్ నంబర్ నమోదు చేయడం వంటివి చేసినప్పుడు మెషీన్ ఆటోమేటిక్‌గా కార్డును హోల్డ్ చేస్తుంది. మరి ఇలాంటప్పుడు కార్డును ఎలా బ్లాక్ చేయాలి? కొత్త కార్డు కోసం ఎలా అభ్యర్థించాలి? అసలు ఇరుక్కుపోయిన పాత కార్డును తిరిగి పొందే మార్గం ఉందా? వంటి పూర్తి వివరాలు

1. భయాందోళన వద్దు – మెషీన్‌ను గమనించండి :

కార్డు రాకపోతే వెంటనే కంగారు పడి మెషీన్‌ను లాగడం లేదా కొట్టడం చేయకండి. ముందుగా ఏటీఎం మెషీన్ పైన ఉండే ATM ID నంబర్, బ్యాంక్ పేరు, స్థానం, సమయాన్ని ఒక దగ్గర రాసుకోండి లేదా ఫోటో తీసుకోండి.

2. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు :

వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయండి. జరిగిన విషయాన్ని వివరించి, మీ కార్డును వెంటనే ‘హాట్‌లిస్ట్’ (Hotlist) లేదా బ్లాక్ చేయమని కోరండి. దీనివల్ల ఆ కార్డు ద్వారా ఎవరూ ఒక్క రూపాయి కూడా తీయలేరు.

3. కార్డును రద్దు చేయడం :

మీ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అనుమానం ఉంటే, కార్డును శాశ్వతంగా రద్దు చేయడమే ఉత్తమం. మీరు కాల్ ద్వారా లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కొత్త కార్డు కోసం అభ్యర్థించవచ్చు. 7 నుండి 10 పని దినాల్లో కొత్త కార్డు మీ ఇంటికి వస్తుంది.

4. పాత కార్డును తిరిగి పొందడం:

ఒకవేళ మీరు కార్డును రద్దు చేయకూడదనుకుంటే, అది మీ సొంత బ్యాంక్ ఏటీఎం అయితే బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయండి. ఏటీఎం మెయింటెనెన్స్ టీమ్ కార్డును తీసి మీ హోమ్ బ్రాంచ్‌కు అప్పగిస్తారు. మీరు మీ ఆధార్ లేదా పాన్ కార్డ్ చూపించి దానిని తిరిగి తీసుకోవచ్చు.

5. ఎందుకు ఇరుక్కుపోతుంది?

సాంకేతిక లోపాలు: నెట్‌వర్క్ సమస్య లేదా పవర్ కట్ అయినప్పుడు.

సెక్యూరిటీ లాక్: పిన్ నంబర్ పదే పదే తప్పుగా కొట్టినప్పుడు లేదా ట్రాన్సాక్షన్ మధ్యలో ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు భద్రత కోసం మెషీన్ కార్డును లాక్ చేస్తుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏటీఎం కార్డు ఇరుక్కుపోయినప్పుడు ఆ పరిసరాల్లో ఉండే అపరిచితుల సాయం తీసుకోకండి. కేవలం బ్యాంక్ అధికారిక నంబర్లకు మాత్రమే కాల్ చేయండి.

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం