AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natural Pain Killers: కిచెన్‌లోనే 5 న్యాచురల్ పెయిన్ కిల్లర్స్.. ప్రతీ నొప్పికి పరిష్కారం వీటిలోనే.. అవేంటో తెలుసా?

Health Tips: మన ఇంటి వంటగదిలో చాలా సహజమైన నొప్పి నివారణ మందులు అందుబాటులో ఉన్నాయి. తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే వీటిని ప్రయత్నించి, అద్భుత ఫలితాడు పొందవచ్చు.

Natural Pain Killers: కిచెన్‌లోనే 5 న్యాచురల్ పెయిన్ కిల్లర్స్.. ప్రతీ నొప్పికి పరిష్కారం వీటిలోనే.. అవేంటో తెలుసా?
Kitchen Medicine And Its Uses
Follow us
Venkata Chari

|

Updated on: Jul 17, 2022 | 2:33 PM

నొప్పి అనేది శరీరంలోని దాదాపు అన్ని భాగాలను ఇబ్బందులో పడేస్తుంది. మన శరీరంలోని ఏ భాగమైనా నొప్పి వస్తే, ఆ నొప్పిని తగ్గించుకోవడానికి చాలామంది మొదట పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు. మార్కెట్‌లో లభించే పెయిన్ కిల్లర్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు దుష్ప్రభావాలను కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.కానీ, వాటి వాడకం మాత్రం తగ్గడం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఇంట్లో వంటగదిలో సహజమైన పెయిన్ కిల్లర్స్ ఉన్నాయని తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీటిని ఉపయోగించి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పసుపు..

ఈ బంగారు రంగు మసాలా పదార్థం ప్రతి వంటగదిలో ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంపై అద్భుతంగా పనిచేస్తాయి. పసుపును పాలలో కలిపి తీసుకుంటే శరీరంలోని అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అలాగే నోటిలో బొబ్బలు ఉంటే, ప్రభావిత ప్రాంతంలో నీరు, కొబ్బరి నూనెతో కలిపి పసుపు ముద్దను పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది క్రిమినాశక, యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంది. దీని పేస్ట్‌ను గాయంపై పూయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా గాయం త్వరగా మానుతుంది. ఫ్లూ వల్ల వచ్చే దురదలను కూడా పసుపు తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

లవంగాలు..

ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటే, లవంగాలను నమలడం లేదా నోటిలో ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగం నూనెను ఉపయోగించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. లవంగం నూనెలో క్రియాశీల పదార్ధమైన యూజినాల్ సహజంగా రక్తాన్ని పల్చగా చేస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారించడం ద్వారా గుండె జబ్బులను కూడా నివారిస్తుంది.

అల్లం..

కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులకు అల్లం గ్రేట్ రెమెడీగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లంలో ఉండే ఫైటోకెమికల్స్ నొప్పిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. వికారం, మార్నింగ్ సిక్‌నెస్‌కి ఇది ఒక శక్తివంతమైన హోం రెమెడీగా పనిచేస్తుంది. అల్లం కలిపితే ఆహారం రుచిగా ఉంటుంది. అల్లం టీ శరీరానికి శక్తిని ఇస్తుంది. అలాగే ఇది శరీర పునరుజ్జీవనానికి కూడా గొప్ప మూలంగా నిలుస్తుంది.

తులసి..

ఇది ఔషధ మూలిక, ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్, అనాల్జేసిక్ ఉన్నాయి. ఇది కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగుల చికిత్సలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని కూడా తులసి నియంత్రిస్తుంది.

వెల్లుల్లి..

ఇంట్లో కూరగాయల రుచిని పెంచే వెల్లుల్లి.. ఏ ఔషధం కంటే తక్కువ కాదు. వెల్లుల్లి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాదు, వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిని 10 నుంచి 15 శాతం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు తాజా రూపంలో వెల్లుల్లిని అదనపు మోతాదులో తింటే, అది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీబయాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది.