AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Athiya Shetty – KL Rahul: మారిన పెళ్లి డేట్.. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ఒక్కటయ్యేది ఎప్పుడంటే?

పెళ్లి తర్వాత అతియా, కేఎల్ రాహుల్ కొత్త ఇంటికి మారనున్నట్లు మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం, ఈ జంట ముంబైలోని పాలి హిల్‌లోని సంధు ప్యాలెస్‌లోని..

Athiya Shetty - KL Rahul: మారిన పెళ్లి డేట్.. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ఒక్కటయ్యేది ఎప్పుడంటే?
Kl Rahul Athiya Shetty
Venkata Chari
|

Updated on: Jul 19, 2022 | 4:23 PM

Share

Athiya Shetty – KL Rahul: భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, అతియా, కేఎల్ రాహుల్ కుటుంబం వారి ప్రణాళికలలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో కాకుండా, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో అంటే 2023 ప్రారంభంలో పెళ్లి జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. దక్షిణ భారత సంప్రదాయాల ప్రకారం ఈ వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

పెళ్లి తర్వాత కొత్త ఇంటికి మారనున్న అతియా-కేఎల్ రాహుల్..

పెళ్లి తర్వాత అతియా, కేఎల్ రాహుల్ కొత్త ఇంటికి మారనున్నట్లు మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం, ఈ జంట ముంబైలోని పాలి హిల్‌లోని సంధు ప్యాలెస్‌లోని విలాసవంతమైన భవనంలో తమ కొత్త ఇంటిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

దక్షిణ భారత సంప్రదాయాల ప్రకారం పెళ్లి..

మీడియా నివేదికల ప్రకారం, రాహుల్, అథియా సౌత్ ఇండియన్ స్టైల్లో పెళ్లి చేసుకుంటారంట. ఎందుకంటే సునీల్ శెట్టి మంగళూరులోని ముల్కిలోని మంగళూరు కుటుంబంలో జన్మించాడు. ఆయన దక్షిణ భారతీయుడు. అదే సమయంలో, రాహుల్ కూడా మంగళూరు కుటుంబానికి చెందినవాడు. కాబట్టి అతియా-కేఎల్ రాహుల్ దక్షిణ భారత ఆచారాల ప్రకారం వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది.

మూడేళ్లుగా డేటింగ్..

కేఎల్ రాహుల్, అతియా 3 సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఇద్దరూ తమ బంధాన్ని గోప్యంగా ఉంచారు. అయితే, అతియా సోదరుడు అహన్ శెట్టి తొలి చిత్రం తడప్ సందర్భంగా వారి సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అథియా తన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో KL రాహుల్‌తో తరచుగా కనిపిస్తుంది.

అథియా 2015లో తన కెరీర్‌ను ప్రారంభించింది..

2015లో సూరజ్ పంచోలీ సరసన ‘హీరో’ చిత్రంతో అతియా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీనితో పాటు ఆమె మరో రెండు చిత్రాలలో కూడా పనిచేస్తుంది. అవి ‘ముబారకన్’, ‘మోతీచూర్ చక్నాచూర్’. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా ఆమెతో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. నివేదికల ప్రకారం, ఇటీవల ఆమె ఒక వెబ్ షోకి కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..