Viral Video: సరదాగా ఎంజాయ్ చేస్తోన్న కొత్త జంట.. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకాసి అలలు.. కట్ చేస్తే..

తాజాగా ఈ కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఓ జంట అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తీరా రింగులు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అంతా పెళ్లి హడావుడిలో ఉన్నారు.

Viral Video: సరదాగా ఎంజాయ్ చేస్తోన్న కొత్త జంట.. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకాసి అలలు.. కట్ చేస్తే..
Wedding Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 18, 2022 | 6:32 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇందులో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని షాకిస్తుంటాయి. ఏది ఏమైనా, ఈ వీడియోలు నెటిజన్లకు నచ్చడంతో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఓ జంట అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తీరా రింగులు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అంతా పెళ్లి హడావుడిలో ఉన్నారు. ఇంతలో అందర్నీ భయభ్రాంతులకు గురిచేసేలా చేసిన ఓ సంఘటన వారి ఆనందాలకు అడ్డుకట్ట వేసింది. ఇది హవాయిలో జరిగింది.

హవాయిలో సముద్రతీరంలో ఓ జంట వివాహ వేడుకలు ప్లాన్ చేసుకున్నారు. బిగ్ ఐలాండ్‌కు పశ్చిమ తీరంలో కైలువా-కోనాలోని హులిహే ప్యాలెస్‌లో శనివారం తమ పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేశారు. రింగులు మార్చుకునేందుకు సమయం ఆసన్నమవడంతో, బంధువులు, అతిథులు అంతా వధూవరుల దగ్గరకు చేరుకుని, సెలబ్రేషన్ మొదలు పెట్టారు. వివాహం సముద్ర తీరం కావడంతో.. సముద్రం నుంచి భారీ అలలు దూసుకొస్తున్నట్లు అంతా గమనించారు. అయితే, ఇబ్బంది పెట్టవనుకుని, అంతా పెళ్లి వేడుకకు సిద్ధమయ్యారు. తీరా దగ్గరకు వచ్చేస్తున్నట్లు గమనించిన వారంతా, అక్కడి నుంచి తప్పుకునేందుకు వేడుక నుంచి వెనక్కు వస్తున్నారు. కానీ, ఇంతలోనే భారీ అలలు వెంట వెంటనే వారి వేడుకను అతలాకుతలం చేశాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nature_Called (@k.e.n_n.y.b)

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే అడ్డుగా పెద్ద గోడ ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సంఘటన గురించి మాట్లాడుతూ, డిల్లాన్, రిలే మర్ఫీ కేవలం కేక్ మాత్రమే కాదు, రిసెప్షన్‌లోని ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత పెళ్లి వేడుకను నిర్వహించారంట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?