Viral Video: పిజ్జా డెలివరీ బాయ్ సాహసం.. మంటల్లో చిక్కుకున్న ఐదుగురు చిన్నారుల కోసం సూపర్ హీరోలా మారాడు..

25 ఏళ్ల పిజ్జా డెలివరీ బాయ్ తన ప్రాణాలకు తెగించి ఐదుగురు చిన్నారులను ఆపదనుంచి సురక్షితంగా రక్షించాడు. కాగా, పిజ్జా డెలివరీ బాయ్‌ అద్భుత ప్రదర్శనపై ఇంటర్నెట్ వినియోగదారులు సంబరాలు చేసుకుంటున్నారు. 'అతను ఈ పనిలో సూపర్‌హీరో, పిజ్జా డెలివరీ కోసం

Viral Video: పిజ్జా డెలివరీ బాయ్ సాహసం.. మంటల్లో చిక్కుకున్న ఐదుగురు చిన్నారుల కోసం సూపర్ హీరోలా మారాడు..
Pizza Delivery Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 19, 2022 | 7:07 PM

25 ఏళ్ల పిజ్జా డెలివరీ బాయ్ తన ప్రాణాలకు తెగించి ఐదుగురు చిన్నారులను ఆపదనుంచి సురక్షితంగా రక్షించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ డెలివరీ మ్యాన్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, అతడు చేసిన గొప్పపనికి చాలామంది నెటిజన్లు అతనికి డొనేషన్లు పంపుతున్నారు. ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడు..? చిన్నారుల కోసం అతడు చేసిన ఆ గొప్ప పని ఏంటీ..? అన్నది పరిశీలించినట్టయితే…యునైటెడ్ స్టేట్స్‌లోని ఇండియానాలో ఓ ఇల్లు హఠాత్తుగా తగలబడింది. ఆ ఇంట్లో 1, 6, 13, 18..మరో 13 యేళ్ల వయసుగల ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఇది గమనించిన ఓ పిజ్జా డెలివరీ బాయ్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించాడు. వీరిలో 1, 6, 13, 18..సంవత్సరాల పిల్లల్ని బైటికి తీసుకురాగలిగాడు. అయితే 6యేళ్ల మరో చిన్నారి ఇంట్లో నిద్రిస్తుందని తెలియడంతో.. ఎగిసిపడుతున్న మంటల్లోకి వీరోచితంగా దూకి.. ఆ చిన్నారిని ఎత్తుకుని బైటికి తీసుకువచ్చాడు.

దీనికోసం ఈ సాహసి తన ప్రాణాలనే ఫణంగా పెట్టాడు. లాఫాయెట్ పోలీస్ డిపార్ట్ మెంట్ దీనికి సంబంధించిన వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. నికోలస్ బోస్టిక్ అనే వ్యక్తి ఓ ఇల్లు తగలబడడం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే వారు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని గ్రహించి తానే రంగంలోకి దూకాడు. అతను వెంటనే తలుపులు పగలగొట్టి.. 18 ఏళ్ల యువకుడితో పాటు మరో నలుగురు చిన్నారులను సురక్షితంగా తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లాడు. ఈ సంఘటన జూలై 11న ఇండియానాలోని లఫాయెట్‌లో జరిగింది. ఒక పోలీసు అధికారి బాడీ కెమెరా ద్వారా సంగ్రహించిన ఫుటేజీలో బోస్టిక్ పిల్లవాడిని తీసుకుని కాలిపోతున్న ఇంట్లోనుంచి బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. అతను ఆ చిన్నారిని చేతుల మీద మోసుకొచ్చి.. పోలీసులకు అప్పగించడం కనిపిస్తుంది. ఈ మేరకు పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో, బోస్టిక్ 1, 6, 13, 18 సంవత్సరాల వయస్సు గల నలుగురు తోబుట్టువులను ముందు రక్షించాడు. ఆ తరువాత ఇంట్లో నిద్రిస్తున్న మరో 6 ఏళ్ల చిన్నారిని రక్షించాడని పోలీసు శాఖ తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

బోస్టిక్ వెనుక తలుపు ద్వారా ఇంట్లోకి ప్రవేశించి మేడమీద ఉన్న పిల్లలను బయటకు తీసుకువచ్చాడు. సురక్షితంగా బయటపడ్డ నలుగురు,..6 ఏళ్ల బాలిక ఇంకా లోపల ఉందని చెప్పారు. అప్పటికే ఇంట్లో మంటలు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అంతే వేగంగా ఇంట్లోకి ఆమెను పైకి లేపి కిటికీలోంచి సురక్షితంగా బయటకు తీశాడు. ఒంటరిగా ఆపరేషన్ చేసిన బోస్టిక్ తీవ్రంగా గాయపడ్డాడని పోలీసు శాఖ తెలిపింది. పొగ పీల్చడం ద్వారా అతడు కాస్త అస్వస్థతకు గురికావాల్సి వచ్చింది. శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడ్డాడని, అతని కుడి చేతికి కూడా పదునైన గాయం అయినట్టు తెలిసింది. బోస్టిక్‌ను ఆసుపత్రికి తరలించగా, కోలుకున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. కానీ, అతడు అంత ప్రమాదంలోననూ ఆశ్చర్యకరంగా 6 ఏళ్ల బాలికను అద్భుతంగా రక్షించి క్షేమంగా బయటకు తీసుకువచ్చాడు.

‘నికోలస్ బోస్టిక్ ప్రదర్శించిన ధైర్యం, ధైర్యం ఐదు ప్రాణాలను కాపాడాయి. ఆయన నిస్వార్థ స్ఫూర్తి ఎందరికో స్ఫూర్తిదాయకం అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ వారి ధైర్యం, సంకల్పం, నిబద్ధత, సంయమనం ప్రదర్శించడం ఆదర్శనీయం. లాఫాయెట్ పోలీస్ డిపార్ట్‌మెంట్, లఫాయెట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ మరియు గౌరవనీయమైన మేయర్ టోనీ రోజ్‌వార్స్కీ అందరూ బోస్టిక్‌కు రుణపడి ఉన్నామంటూ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కాగా, పిజ్జా డెలివరీ బాయ్‌ అద్భుత ప్రదర్శనపై ఇంటర్నెట్ వినియోగదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ‘అతను ఈ పనిలో సూపర్‌హీరో, పిజ్జా డెలివరీ కోసం ప్రతిరోజూ హీరో’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

“నికోలస్ బోస్టిక్ వీరోచిత చర్య వల్ల ఐదు ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ సంఘటనలో అతని నిస్వార్థత స్ఫూర్తిదాయకం. అతను తన ధైర్యం, దృఢత్వం, అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ స్థిరమైన ప్రశాంతతతో అనేకమందిని ఆకట్టుకున్నాడు. లఫాయెట్ పోలీస్ డిపార్ట్‌మెంట్, లఫాయెట్ ఫైర్ డిపార్ట్‌మెంట్, మేయర్ టోనీ రోస్వార్స్కీ నికోలస్ జోక్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటారు. అతని చర్యలకు అతన్ని బహిరంగంగా గుర్తించాలనుకుంటున్నారు” అని పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ట్వీట్ తరువాత అతనికి కావాల్సిన సాయం కోసం అతని పేరుమీద ఫండ్ రెయిజింగ్ కూడా మొదలయ్యింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి