ఏపీకి పొంచివున్న ముంపు..! మరో రెండ్రోజుల పాటు మోస్తరు వానలు..

రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, గుణా, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని, అల్పపీడనం రాయ్ పూర్, పరదీప్ మీదుగా పయనించి..

ఏపీకి పొంచివున్న ముంపు..! మరో రెండ్రోజుల పాటు మోస్తరు వానలు..
Ap Weather Alert
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 18, 2022 | 8:41 PM

ఏపీలో మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, గుణా, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని, అల్పపీడనం రాయ్ పూర్, పరదీప్ మీదుగా పయనించి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వీటి ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. కాగా, ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పడమర దిశల నుంచి గాలులు వీస్తాయని తెలిపింది.

ఇక తెలంగాణను ఇంకా వర్షాల ముప్పు వీడడం లేదు. నేడు భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి నిన్న మళ్లీ భూ ఉపరితలంపైకి వచ్చింది. సాయంత్రానికి ఒడిశా తీరంపై కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు భారీగా, రేపు ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి