ఆ హోటల్ నుంచి పార్శిల్ తెచ్చుకున్న ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షం.. అవి తిన్న మహిళ పరిస్థితి..?
బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో ఇడ్లీ కొని పార్సల్‌గా తెచ్చుకుంది. వ్యాపారం చేసుకునే చోట పార్శిల్ ఓపెన్ చేసి రెండు ఇడ్లీలు తినేసింది. మూడో ఇడ్లీ తింటుండగా,ఇడ్లీలో జెర్రీ కనిపించింది.
హోటల్ ఫుడ్‌లో అప్పుడప్పుడు ఈగలు, బొద్దింకలు, బల్లులు ప్రత్యక్షం కావటం తరచూ చూస్తుంటాం.. అలాంటి సందర్భాల్లో వినియోగదారులు సదరు హోటల్ సిబ్బందిపై దాడులు చేయటం, కేసులు పెట్టటం వంటివి అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే, తాజాగా ఓ టిఫిన్ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ సారి ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షమైంది. దాంతో ఆ టిఫిన్ తిన్న మహిళ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. సదరు మహిళ పరిస్థితి ఎలా ఉంది..? ఏంటి.? పూర్తి వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో ఇడ్లీలో జెర్రీ రావడం కలకలం సృష్టించింది. సోమవారం వారసంత కావడంతో కూరగాయలు అమ్మే రమ అనే మహిళ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్లో ఇడ్లీ కొని పార్సల్‌గా తెచ్చుకుంది. వ్యాపారం చేసుకునే చోట పార్శిల్ ఓపెన్ చేసి రెండు ఇడ్లీలు తినేసింది. మూడో ఇడ్లీ తింటుండగా,ఇడ్లీలో జెర్రీ కనిపించింది. దాంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. పక్కకున్న వారికి చూపడంతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు హోటల్ పై దాడి చేసి సీజ్ చేశారు.
అలాగే పట్టణంలో ఉన్న హోటల్స్ పై దాడి చేసి ఫుడ్ సరిగా లేని ఆరు హోటల్స్‌కు జరిమానా విధించారు. కొన్నిచోట్ల చికెన్ పదార్థాలు పాడైన వాసన వస్తున్నాయని అధికారులు తెలిపారు. హోటళ్లు మెస్‌లపై నిరంతరం నిఘా ఉంచాల్సిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ప్రజలు ఆరోపించారు. ఈ దాడుల్లో జూనియర్ అసిస్టెంట్ సాగర్, నాంపెల్లి విజయ్, రాజు, శ్రవణ్ కుమార్, కృష్ణతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి