Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నిర్ధారణ.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్‌..

కేసులు నమోదుకాక‌పోయినా మంకీ పాక్స్ పట్ల వైద్య ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో

Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నిర్ధారణ.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్‌..
Minister Harish Rao
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Jul 18, 2022 | 8:40 PM

కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదుకావటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో కేరళ పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటకతో పాటు, ఏపీ తెలంగాణలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ఏపీలో ఓ చిన్నారికి మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించయనే వార్తలు అందరిలోనూ మరింత ఆందోళనను పెంచాయి. దాంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పలు ఆస్పత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంకీ పాక్స్ కేసుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంకీ పాక్స్ లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు డీఎంఈ, టీవీవీపీ వైద్యులతో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. వెంగ‌ళ్ రావు న‌గ‌ర్ లోని IIFH నుంచి జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 60కి పైగా దేశాల్లో 12 వేల దాకా కేసులు నమోదైనప్పటికీ, మన దేశంలో కేరళలో రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయని చెప్పారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క‌టి కూడా వెలుగుచూడ‌లేద‌ని స్పష్టం చేశారు. అనుమానిత ల‌క్ష‌ణాల‌తో ఉన్న‌వారు కూడా రాలేద‌ని చెప్పారు.

కేసులు నమోదుకాక‌పోయినా మంకీ పాక్స్ పట్ల వైద్య ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల గురించి తెలుసుకుంటూ, డబ్ల్యూహెచ్వో, ఐసిఎంఆర్ మార్గదర్శకాలు పాటిస్తున్నట్లు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ కోసం ప్ర‌త్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అనుమానిత కేసులకు తక్షణ చికిత్స అందించేందుకు నోడల్ ఆసుపత్రిగా ఫీవర్ ఆసుపత్రిని ఎంపిక చేసిన‌ట్టు చెప్పారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గాంధీలో ఆర్టీపీసీఆర్ ప‌రీక్షలు చేయడం, పాజిటివ్ వస్తె నిర్ధారణ కోసం న‌మూనాల‌ను పుణెలోని ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు.

మంకీ పాక్స్ లక్షణాలు, పరీక్షలు, చికిత్స విధానం పట్ల వైద్యులందరు అవగాహన పెంచుకోవాలని, క్షేత్ర స్థాయి సిబ్బందికి వివరించాలని మంత్రి సూచించారు. వైరస్ కు సంబంధించిన అనుమానిత లక్షణాలు గుర్తించిన వెంటనే బాధితుల నుంచి న‌మూనాలు సేక‌రించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మంకీపాక్స్ న‌మోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వ‌చ్చే ప్ర‌యాణికులు ఐసొలేష‌న్‌లో ఉండాల‌ని, అనుమానిత ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ప్రాథమిక ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌న్నారు. సీజనల్ వ్యాధులు, మంకీ పాక్స్, వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాలు కోసం 04024651119, 9030227324 సంపాదించాలని ప్రజలకు సూచించారు.

ఇవి కూడా చదవండి

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త.. వర్షాలు, వరదల కారణంగా సీజ‌న‌ల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, రాబోయే వారం పది రోజులు అన్ని ఆసుపత్రిలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ఓపి సమయాన్ని పెంచి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాల‌న్నారు. అన్ని ఆసుపత్రుల్లో సూపరిండెంట్లు ఎప్పటికప్పుడు ప‌రిశీలిస్తూ చిన్న చిన్న సమస్యలను తక్షణం పరిష్కరించుకోవాలన్నారు. పేషెంట్లకు మంచి వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లు 24 గంటలు పని చేయాలని ఫలితాలను వీలైనంత వేగంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాల‌న్నారు.

డైట్, శానిటేష‌న్ టెండర్లు దాదాపు అన్ని ఆసుపత్రుల్లో పూర్తయ్యాయని, కాబట్టి మంచి డైట్ అందించడంతోపాటు శానిటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. కొత్త డైట్ మెనూను ప్రతి ఆసుపత్రుల్లో ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. AML/EML లో మందుల సంఖ్యను 843 కి పెంచుకున్నామని, బయటికి మందులు రాయకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్ లకు సూచించారు. కొత్త మందుల జాబితా గురించి పీజీ, ఎస్ ఆర్ లకు తెలియజేయాలన్నారు.

అర్హులందరికీ బూస్టర్ ఇవ్వాలి… 18 ఏళ్లు దాటి, రెండో డోసు వేసుకొని 6 నెళ్ళు పూర్తయిన వారికి బూస్టర్ డోసు అందించాలని మంత్రి ఆదేశించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పట్ల ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.