ఇప్పటికింకా మా వయసు నిండా పదహారే.. అంటున్న వృద్ధ జంట..! అదిరిపోయే డ్యాన్స్‌తో ఇరగదీస్తున్నారు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వృద్ధ దంపతులకు సంబంధించిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇప్పటికింకా మా వయసు నిండా పదహారే.. అంటున్న వృద్ధ జంట..! అదిరిపోయే డ్యాన్స్‌తో ఇరగదీస్తున్నారు..
Amazing Dance
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 18, 2022 | 5:45 PM

ఏదైనా చేయాలనే తపన ఉంటే వయసు అడ్డుకాదని అంటారు. వాస్తవానికి, కొంతమందికి వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య. పెద్దవారైనప్పటికీ యవ్వనంలో జీవించిన ఉత్సాహంతో జీవిస్తుంటారు. గిరగిరా తిరిగేస్తుంటారు. ఎప్పుడూ సరదగా గడిపేస్తుంటారు. పాటలు పాడతారు. డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు. సాధారణంగా 60 ఏళ్ల తర్వాత కాళ్లు బలహీనపడటం కనిపిస్తుంది. డ్యాన్స్, పాటలకు దూరంగా, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. వృద్ధులు సరిగ్గా నడవలేని వీడియోలను మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వృద్ధ దంపతులకు సంబంధించిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సాధారణంగా ప్రజలు ఇంత కాలం జీవించటమే కష్టంగా మారింది ప్రస్తుత కాలంలో. ఒకవేళ బ్రతికి ఉన్నా కూడా,…వారు మంచానికే పరిమితం అవుతుంటారు. కానీ, 90 ఏళ్లు దాటిన ఓ వృద్ధ జంట ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తున్నారు. 90 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఈ వృద్ధ జంట డ్యాన్స్‌తో యువ జంటలకే చెమటలు పట్టిస్తున్నారు. అక్కడ డ్యాన్స్‌ చేస్తున్న వృద్ధుడి వయస్సు 94 సంవత్సరాలు. ఆ బామ్మ వయస్సు 91 సంవత్సరాలుగా తెలిసింది.ఈ వయస్సులో కూడా ఇంత చురుగ్గా ఉండే వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. 25-30 ఏళ్ల వయసులో ఉన్న కపుల్స్‌ మాదిరిగా వారు తమ స్టెప్స్‌తో అదరగొట్టేస్తున్నారు. చుట్టూ ఉన్న జనాలు కూడా వృద్ధ జంటను చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తున్నారు. వృద్ధ జంట సరదాగా ఎలా డ్యాన్స్ చేస్తున్నారో వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోని చూసి జనాలు చాలా అవాక్కై పోతున్నారు. వృద్ధ డ్యాన్స్‌ను ఇష్టపడుతూ రకరకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు. మీమ్స్‌ని షేర్ చేస్తున్నప్పుడు.. జీవితమంటే ఇలాగే ఎంజాయ్‌ చేయాలి మరీ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం