Monkeypox: దడ పుట్టిస్తోన్న మంకీపాక్స్.. దేశంలో రెండో పాజిటివ్ కేసు నమోదు.. ఎక్కడంటే..

మంకీ పాక్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, విదేశాల నుంచి తిరిగి వస్తున్నవారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలోనే దేశంలో తాజాగా మరో మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది.

Monkeypox: దడ పుట్టిస్తోన్న మంకీపాక్స్.. దేశంలో రెండో పాజిటివ్ కేసు నమోదు.. ఎక్కడంటే..
Follow us

|

Updated on: Jul 18, 2022 | 4:33 PM

Monkeypox: కరోన తర్వాత అంతగా భయపెడుతున్న వ్యాధి మంకీ పాక్స్. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు బయటపడుతూ అందరినీ కలవరపెడుతున్నాయి. భారత్‌లోనూ మంకీ పాక్స్ కేసులు వెలుగులోకి రావటంతో అందరిలోనూ భయాందోళన మొదలైంది. దేశం తొలి మంకీ పాక్స్‌ కేసు కేరళలో నమోదుకావడం, దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ పాక్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, విదేశాల నుంచి తిరిగి వస్తున్నవారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలోనే దేశంలో తాజాగా మరో మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. కేరళలో మంకీపాక్స్ వైరస్ సోకిన మరో కేసు నమోదైందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం తెలిపారు.

మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఐదు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రం కేరళలో మంకీపాక్స్‌ కేసు నమోదైన రెండు రోజుల వ్యవధిలోనే కేరళలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదుకావటం కలకలం రేపుతోంది. షార్జా-తిరువనంతపురం ఇండిగో విమానంలో వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్‌ సోకిన వ్యక్తితో కలిసి తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయంకు చెందిన ప్రయాణికులు రావటంతో ఆ ఐదు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక జారీ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

విజయవాడలో రెండేళ్ల చిన్నారిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడంతో అంత అలర్ట్ అయ్యారు. కానీ అది మంకీ పాక్స్ కాదని పుణే ల్యాబ్‌ తేల్చింది. ఇటీవలే ఈ చిన్నారి కుటుంబం దుబాయ్ నుంచి విజయవాడకు వచ్చింది. ఆమె ఒంటిపై ఓ రకమైన దద్దుర్లు, జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి చర్మంపై దద్దుర్లను, ఇతర లక్షణాలను పరిశీలించిన వైద్యులు.. అవి మంకీ పాక్స్ లక్షణాల తరహాలో కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్ కు తరలించారు. చిన్నారి నుంచి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్టులో చిన్నారికి మంకీ పాక్స్ లేదని.. సాధారణ దద్దుర్లేనని తేలింది. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి