GST Rate Hike: ఇక నుంచి వీటి ధరలు మరింత ప్రియం.. నేటి నుంచి కొత్త జీఎస్టీ అమలు.. రేట్లు పెరిగేవి.. తగ్గేవి ఇవే..

GST Rate Hike: నేటి నుంచి సామాన్యులపై మరింత భారం పడనుంది. పలు వస్తువుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న జనాలకు.. పెరిగిన జీఎస్టీతో..

GST Rate Hike: ఇక నుంచి వీటి ధరలు మరింత ప్రియం.. నేటి నుంచి కొత్త జీఎస్టీ అమలు.. రేట్లు పెరిగేవి.. తగ్గేవి ఇవే..
Gst Hike
Follow us
Subhash Goud

|

Updated on: Jul 18, 2022 | 4:58 PM

GST Rate Hike: నేటి నుంచి సామాన్యులపై మరింత భారం పడనుంది. పలు వస్తువుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న జనాలకు.. పెరిగిన జీఎస్టీతో జూన్‌ 18 నుంచి మరింత భారం కానుంది.జూన్ 28 నుండి 29 వరకు జరిగిన GST కౌన్సిల్ 47వ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఈ జీఎస్టీ రేట్ల పెంపు ఆసుపత్రుల్లో చికిత్స ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ అద్దె ఉన్న ఆసుపత్రుల నాన్-ఐసియు గదులకు 5% జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఈ రోజు 18 జూలై 2022 నుండి అమలులోకి వచ్చింది. అయితే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చికిత్స ఖరీదైనది

ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ నుండి హాస్పిటల్ అసోసియేషన్, ఇతర వాటాదారులు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లోని పడకలపై జీఎస్టీ విధింపు నిర్ణయం వల్ల ప్రజలకు తీవ్ర భారం పడుతుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రి బెడ్స్ పై జీఎస్టీ విధింపు 

ఉదాహారణకు ఒకరోజు ఆసుపత్రి బెడ్‌కు అద్దె రూ.5,000 అనుకుందాం ఆపై రూ.250 జీఎస్టీగా చెల్లించాల్సి ఉంటుంది. రోగి రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే గది అద్దె రూ.10వేలు, జీఎస్టీతో రూ.10.500. రోగి ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉండవలసి వస్తే, చికిత్స మరింత ఖరీదైనదిగా మారుతుంది. అయితే కొన్ని ఉత్పత్తులపై కొత్త జీఎస్టీ రేట్లు సోమవారం (జూలై 18) నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ పెంపు వల్ల కొన్నింటి ధరలు తగ్గిపోగా, మరికొన్నింటి ధరలు పెరిగాయి.

ధరలు పెరిగేవి..

ప్యాక్ చేసి విక్రయించే ఆహార ఉత్పత్తుల ధరలు నేటి నుంచి పెరగనున్నాయి. ఆహార ఉత్పత్తులు అంటే రోజువారీగా కొనుగోలు చేసే తినుబండారాలు, అప్పడాలు, జంతికలు, మిక్చర్ తదితరాలు, అలాగే ప్యాక్ చేసి విక్రయించే ఆటా పిండి పెరుగు, ఆసుపత్రుల్లో రూ.5,000కు మించిన రూమ్ రెంట్ పై కొత్తగా 5 శాతం జీఎస్టీ వేశారు. ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి జీఎస్టీ లేదు. ఈ రోజు నుంచి జీఎస్టీ మోత మోగనుంది. టెట్రా ప్యాక్ లపై 18 శాతం జీఎస్టీ పడనుంది. బ్యాంకులు చెక్కుల జారీ కోసం వసూలు చేసే చార్జీపై 18 శాతం జీఎస్టీ వడ్డించనుంది కేంద్రం. మ్యాప్ లు, చార్ట్ లు, అట్లాస్ లపైనా 12 శాతం జీఎస్టీ చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఇక ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్.. చాకులు, పేపర్లను కత్తిరించే చాకులు, పెన్సిల్ షార్ప్ నర్లు, ఎల్ఈడీ ల్యాంపులపై 12 శాతంగా ఉన్న జీఎస్టీ ఇప్పుడు 18 శాతం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక సోలార్ వాటర్ హీటర్లపై ఇప్పటి వరకు 5 శాతం జీఎస్టీ ఉంటే ఇప్పుడు 12 శాతానికి పెంచారు. దీంతో ఇక నుంచి అధిక భారం పడనుంది. అంతేకాకుండా రహదారులు, వంతెనలు, రైల్వేలు, మెట్రోలు, అఫ్లూయంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు సంబంధించి కాంట్రాక్టు పనులు, శ్మశాన వాటికల సేవలపై 12 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచారు.

ధరలు తగ్గేవి..

రోప్ వేల ద్వారా వస్తువుల రవాణా, ప్రయాణికుల రవాణా సేవలపై 12 శాతం జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించారు. వాయు మార్గంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి, ఈశాన్య రాష్ట్రాలకు, బాగ్రోడియాకు తీసుకెళ్లే ప్రయాణికుల సేవలపై జీఎస్టీ మినహాయించింది కేంద్రం. ట్రక్కులు, గూడ్స్ క్యారియర్ల అద్దెలపై సర్వీస్ చార్జీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతం రాయితీ కల్పించింది కేంద్రం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు