Electric Highway: కేంద్రం మరో ముందడుగు.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్‌ హైవే..!

Electric Highway: దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర సర్కార్‌ భారీ ప్రణాళికలు రచిస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి వాహనాలకు మెరుగైన సే..

Electric Highway: కేంద్రం మరో ముందడుగు.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్‌ హైవే..!
Electric Highway
Follow us

|

Updated on: Jul 18, 2022 | 2:26 PM

Electric Highway: దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర సర్కార్‌ భారీ ప్రణాళికలు రచిస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి వాహనాలకు మెరుగైన సేవలు అందిస్తోంది. విద్యుత్‌తో నడిచే రైళ్ల మాదిరిగానే ఇక వాహనాలు కూడా నడవనున్నాయి. హైవేల వెంట ఎలక్ట్రిక్‌ వైర్లను ఏర్పాటు చేసిన వాహనాలు విద్యుత్‌తో నడిచే విధంగా ప్లాన్‌ వేస్తోంది కేంద్రం. ఇక ఢిల్లీ-ముంబై మధ్య ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అక్కడ ఓవర్ హెడ్ వైర్ల సాయంతో వాహనాలకు విద్యుత్ సరఫరా చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాలను నాలుగు లేన్ల రహదారితో అనుసంధానించాలని ఆయన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు భారీ వాహన యజమానులందరూ ప్రత్యామ్నాయ ఇంధనాలైన ఇథనాల్, మిథనాల్, గ్రీన్ హైడ్రోజన్ ఈజ్‌లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

ఎలక్ట్రిక్‌ హైవే అంటే..

ఎలక్ట్రిక్‌ హైవే అంటే వాహనాలు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్‌ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఈ విద్యుత్‌ లైన్‌ ఉంటాయి. హైవే పొడవున ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీ బస్సులు, ట్రాలీ ట్రక్కులను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని నిర్మూలించడంతో పాటు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విద్యుత్‌ లైన్‌లను అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానం చేయనున్నారు. రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరుగుతుండటం, ఆర్‌టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్‌ చేస్తామని మంత్రి వెల్లడించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించడమే తమ లక్ష్యమని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి