AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Interest Rates: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్లను పెంచిన ఈ మూడు బ్యాంకులు..!

Bank Interest Rates: ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తూ ఉన్నాయి. ఈ కొత్తగా అమల్లోకి వచ్చిన వడ్డీ రేట్లలో సాధారణ వినియోగదారుల కంటే సీనియర్‌ సిటిజన్స్‌కు..

Bank Interest Rates: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేట్లను పెంచిన ఈ మూడు బ్యాంకులు..!
Bank Interest Rates
Subhash Goud
|

Updated on: Jul 17, 2022 | 10:43 AM

Share

Bank Interest Rates: ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తూ ఉన్నాయి. ఈ కొత్తగా అమల్లోకి వచ్చిన వడ్డీ రేట్లలో సాధారణ వినియోగదారుల కంటే సీనియర్‌ సిటిజన్స్‌కు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల చేసే వారికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి బ్యాంకులు. ఉద్యోగ విరమణ తర్వాత అధిక రాబడి పొందాలనుకునేవారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. ఇక ఐడీబీఐ బ్యాంకు, డీబీఎస్‌ బ్యాంకు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచాయి. IDBI బ్యాంకు రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. జూలై 14 నుంచి అమల్లోకి వచ్చాయి. BDS బ్యాంకు తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెంచేశాయి. ఈ రేట్లు జూలై 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

IDBI బ్యాంకు FD వడ్డీ రేట్లు:

6 నెలల 1 రోజు నుంచి 270 రోజులలో మెచ్యూర్‌ అయ్యే దేశీయ టర్మ్‌ డిపాజిట్లు ఇప్పుడు 4.50 శాతం వడ్డీ రేటు లభిచనుంది. 1 సంవత్సరం నుంచి 18 నెలల లోపు మెచ్యూర్‌ అయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఇప్పుడు 5.35 శాతం వడ్డీ రేటు, 18 నెలల నుంచి 30 నెలలోపు కాలవ్యవధికి 5.40 శాతం వడ్డీ రేటు, 30 నెలల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 5.50 శాతం వడ్డీరేటును అందజేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

BDS బ్యాంకు FD వడ్డీ రేట్లు:

డీబీఎస్‌ బ్యాంకు ఇండియా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీర ఏట్లను 10 నుంచి 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. అదనంగా సీనియర్‌ సిటిజన్లు, ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం డిపాజిట్ల కోసం కొత్త రేట్ల కంటే 50 బేసిస్‌ పాయింట్లు అందుకుంటారు. ఈ బ్యాంకు 181 రోజుల నుంచి 269 రోజుల వరకు సాధారణ ప్రజలకు వర్తించే కాలవ్యవధికి మనుపటి 3.25 శాతం నుంచి 4.75 శాతానికి 150 బేసిస్‌ పాయింట్లు పెంచబడ్డాయి. 270 రోజుల నుంచి 1 సంవత్సరంలోపు 100 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4.75 శాతానికి, ఒక సంవత్సరం నుంచి 375 రోజుల మధ్య కాలానికి 5.65 శాతానికి పెంచబడ్డాయి. ఇందులో 35 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. రెండు సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు కాల వ్యవధిలో ఎఫ్‌డీ రేటు 6 శాతం, మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ, లేదా సమానంగా డీబీఎస్‌ బ్యాంకు ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మనుపటి 6 శాతం నుంచి 6.75 శాతానికి పెంచింది.

అలాగే జూలై 16నుంచి యాక్సిస్‌ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెంచిన 6 నెలల నుంచి 7 నెలల కంటే తక్కువ కాల వ్యవధిలో, 8 నెలల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీల కోసం 9 నెలల లోపు వడ్డీ రేట్లు 4.40 శాతం నుంచి 4.65 శాతానికి పెంచింది. ఇతర ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మారలేదు. ఒక సంవత్సరం 25 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ కాలానికి మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లపై 5.60 శాతం, 15 నెలల నుంచి రెండేళ్లలోపు మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లు 5.60 శాతం కొనసాగుతుంది.11 రోజుల నుంచి ఒక సంవత్సరం 25 రోజులలో మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..