AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motor Insurance: ఎంత నడిపితే అంత.. వెహికల్ ఇన్సూరెన్స్‌లో భారీ మార్పులు

Motor Insurance: మీరు మీ వాహన బీమా పాలసీని కొనుగోలు చేయబోతున్నట్లయితే లేదా రెన్యువల్ చేయబోతున్నట్లయితే, ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఉంది. ఇప్పుడు మీ డ్రైవింగ్ స్టైల్, మీరు వాహనాన్ని..

Motor Insurance: ఎంత నడిపితే అంత.. వెహికల్ ఇన్సూరెన్స్‌లో భారీ మార్పులు
Motor Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Jul 16, 2022 | 9:25 AM

Motor Insurance: మీరు మీ వాహన బీమా పాలసీని కొనుగోలు చేయబోతున్నట్లయితే లేదా రెన్యువల్ చేయబోతున్నట్లయితే, ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఉంది. ఇప్పుడు మీ డ్రైవింగ్ స్టైల్, మీరు వాహనాన్ని ఎంత డ్రైవ్ చేస్తున్నారు అనే అంశాలు రెండూ మీ బీమా ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. వాస్తవానికి బీమా నియంత్రణ సంస్థ IRDA సాధారణ బీమా కంపెనీలను వాహనాల స్వంత నష్టం కోసం కొత్త రకాల వినూత్న యాడ్-ఆన్ పాలసీలను ప్రారంభించేందుకు అనుమతించింది. ఇవి వాహన బీమా పాలసీలపై అనేక అదనపు ప్రయోజనాలను, సమగ్ర రక్షణ కవర్లలో కొత్త ఫీచర్లను ప్రారంభించేందుకు అవకాశాననిస్తున్నాయి. వినూత్న బీమా యాడ్-ఆన్ కవర్ కింద, వాహన బీమా ప్రీమియం ఇప్పుడు డ్రైవింగ్ విధానం ప్రకారం నిర్ణయం అవుతుంది.

IRDA ఈ చొరవతో వాహన బీమా పాలసీలను సరసమైనదిగా చేయడం. అలాగే మార్కెట్‌లో దాని వ్యాప్తిని పెంచడం. పే యాజ్ యు డ్రైవ్, పే హౌ యు డ్రైవ్, ఫ్లోటర్ పాలసీలను ప్రవేశపెట్టడానికి బీమా కంపెనీలను ఐఆర్‌డిఎ అనుమతించింది. ఇవి టెలిమాటిక్స్ ఆధారిత బీమా పాలసీలు, వీటికి ప్రీమియం వాహనం డ్రైవింగ్ విధానంపై ఆధారపడి ఉంటుంది. GPS సాంకేతికత సహాయంతో, మీ వాహనం ఎక్కడ ఉంది. దానిని మీరు ఎలా నడుపుతున్నారు అనే పూర్తి సమాచారాన్ని టెలిమాటిక్స్ అందిస్తుంది.

కొత్త యాడ్-ఆన్ కవర్ల ప్రయోజనం ఏమిటి?

ఇవి కూడా చదవండి

అయితే అందరికి ఉన్న అనుమానం ఏమిటంటే.. ఈ కొత్త యాడ్-ఆన్ కవర్ల ఇతర ప్రయోజనాలు ఏమిటి అనేది. IRDA ఈ ఇన్సూరెన్స్ చొరవతో దేశంలో మోటార్ ఓన్ డ్యామేజ్ కవర్‌లోని లోపాలు పరిష్కారం అవుతాయి. ఇది వాహన బీమా ప్రీమియంల అమ్మకాలను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ప్రీమియం వ్యక్తిగత ప్రాతిపదికన నిర్ణయం అవుతుంది. పే యాజ్ యు డ్రైవ్ లేదా పే హౌ యు డ్రైవ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం వల్ల ఎక్కువ డ్రైవ్ చేయని కస్టమర్‌లకు ప్రయోజనం చేకూరుతుంది. మీ వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనం నడపండి.

అవసరాలకు అనుగుణంగా ప్రీమియం

IRDA అందరికీ ప్రామాణిక ప్రీమియం ప్రాక్టీస్‌ను ముగించేలా చేస్తుంది. వినియోగదారులు వారి ఉపయోగం, వినియోగం ఇతర అవసరాలకు అనుగుణంగా ప్రీమియం పొందే సదుపాయాన్ని పొందుతారు. ఈ యాడ్-ఆన్ కవర్‌ల గురించి వివరంగా చెప్పుకుంటే, పే యాజ్ యు డ్రైవ్ అనేది సమగ్ర మోటారు బీమా ప్లాన్, ఇందులో వాహనం వినియోగాన్ని బట్టి ప్రీమియం నిర్ణయిస్తారు. మీరు ఎక్కువ డ్రైవ్ చేసే వాహనాలపై మీరు తక్కువ డ్రైవ్ చేసే వాటి కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు, పే హౌ యు డ్రైవ్ విషయంలో, ప్రీమియం మీ డ్రైవింగ్ మోడ్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ చలాన్లు చెల్లించి, ప్రమాదాలకు గురైనట్లయితే మీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లోటర్ పాలసీ కింద మీరు మీ ద్విచక్ర వాహనం, నాలుగు చక్రాల వాహనాలకు అంటే బైక్-స్కూటర్, కారుకు ఒకే మోటారు బీమా పాలసీ కింద బీమా చేయవచ్చు. ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఎడెల్‌వీస్ జనరల్ ఇన్సూరెన్స్ ఇటీవల ఇదే విధానాన్ని ప్రారంభించింది. ఈ పాలసీ దాని యాప్ ద్వారా విక్రయిస్తున్నారు. మీరు కారును ఉపయోగించకపోతే మీరు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు.

బీమా కంపెనీల ఆమోదంతోనే యాడ్‌-ఆన్‌ పాలసీ

IRDAI తాజా సంస్కరణలు బీమా పరిశ్రమ, కస్టమర్ రెండింటికీ ఉపయోగకరంగా ఉంటుందని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ CEO రాకేష్ జైన్ చెప్పారు. ప్రతి వ్యక్తి డ్రైవింగ్, వాహన వినియోగ విధానం భిన్నంగా ఉంటుంది. వాహనాల సొంత-డ్యామేజ్ కోసం కొత్త రకం వినూత్న యాడ్-ఆన్ పాలసీని తీసుకురావడానికి బీమా కంపెనీల ఆమోదంతో, మెరుగైన ఫీచర్ ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల అవుతాయి. తమ వాహనాలను పరిమితంగా వినియోగించుకునే వారు తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ భావన ఆధారంగా, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ గత సంవత్సరం ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్‌లను ట్రాక్ చేయడంలో బీమా సంస్థలకు సహాయపడే ఈ వినూత్న ఉత్పత్తులలో AI, డేటా అనలిటిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని మిస్టర్ జైన్ చెప్పారు. ఇది ఉత్పత్తులలో కొత్త ఫీచర్స్ ను ప్రారంభించడంలో వారికి సహాయపడుతుంది.

మొత్తంమీద, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ కొత్త చొరవ ప్రజలను వారి వాహనాలను జాగ్రత్తగా చూసుకోవడానికి, ట్రాఫిక్ నియమాలను అనుసరించడానికి, మంచి డ్రైవింగ్ ప్రవర్తనను నిర్వహించడానికి ప్రోత్సహిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి