GST Hike: ఇకపై పెరుగు.. లస్సీ కావాలంటే మరింత ఖర్చు పెట్టాల్సిందే.. ఎందుకంటే..
GST Hike:ముందే ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడికి భారంగా మారుతోంది. రోజురోజుకు ..
Updated on: Jul 15, 2022 | 11:20 AM

GST Hike:ముందే ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడికి భారంగా మారుతోంది. రోజురోజుకు ధరలు మండిపోతున్నాయి.

జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జూలై 18 నుంచి అమలు చేస్తున్నారు. జూలై 18 నుంచి టెట్రా ప్యాక్ పెరుగు, లస్సీ, మజ్జిగపై 5% జీఎస్టీ విధిస్తారు.

ఇప్పటి వరకు వీటిపై జీఎస్టీ వర్తించలేదు. ఇది కాకుండా, హోటళ్లలో రోజుకు రూ. 1000 కంటే తక్కువ అద్దె గదులపై 12 శాతం GST అప్లై అవుతుంది. రూ. 5,000 కంటే ఎక్కువ అద్దెపై ఆసుపత్రులలో 5 శాతం పన్ను చెల్లించాలసి ఉంటుంది.

అట్లాస్ మ్యాప్స్ పై 12% GST ఉంటుంది. అదేవిధంగా ఇకపై LED లైట్లు, LED ల్యాంప్ బ్లేడ్‌లు, పేపర్ కత్తెరలు, పెన్సిల్ షార్పనర్‌లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్, కేక్-సర్వర్లు మొదలైనవి ఇప్పుడు 18 శాతం GSTని ఆకర్షిస్తాయి. ఈ వస్తువులపై జీఎస్టీ ఇప్పటివరకు 12 శాతంగా ఉంది.





























