Viral Video: నెమలి అద్భుతమైన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్.. మంత్ర ముగ్ధులవుతున్న వీక్షకులు

నెమలి నాట్యం చేయడం  చాలా అరుదుగా చూస్తాం. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో వైరల్ అవుతోంది.. నెమలి తన అందమైన ఈకలను విస్తరించి నృత్యం చేస్తుంది. ఈ దృశ్యం అద్భుతమైనది..

Viral Video: నెమలి అద్భుతమైన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్.. మంత్ర ముగ్ధులవుతున్న వీక్షకులు
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 15, 2022 | 11:03 AM

Viral Video: నెమలి (Peacock)మన జాతీయ పక్షి. నెమలికి హిందూ ధర్మంలో కూడా విశిష్ట స్థానం ఉంది.  అనేక కారణాల వల్ల నెమలి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నెమలి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీని అందమైన, రంగురంగుల ఈకలు మనస్సును బంధిస్తాయి. అంతేకాదు నెమలి అందమైన మెడకు కూడా ప్రసిద్ది చెందింది. నెమలి నృత్యం గురించి వినని వారు బహు అరుదు. నెమలి నాట్యం ప్రజాదరణ పొందింది. వర్షాకాలంలో నెమలి పురి విప్పి నృత్యం చేస్తుందని.. అందరికి తెలుసు.. అయితే ఈ దృశ్యం చాలా అరుదు. నెమలి నాట్యం చేయడం  చాలా అరుదుగా చూస్తాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో వైరల్ అవుతోంది.. నెమలి తన అందమైన ఈకలను విస్తరించి నృత్యం చేస్తుంది. ఈ దృశ్యం అద్భుతమైనది..

పార్క్‌లో కూర్చున్న నెమలి అకస్మాత్తుగా నడుముని తిప్పుతూ రెక్కలు విప్పడం ప్రారంభించడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. రెక్కలు చాలా పెద్దవిగా ..  అందంగా విప్పడం చూసిన వారు మంత్రముగ్ధులవుతారు. నెమలికి సంబంధించిన ఈ వీడియో పార్క్ నుండి వచ్చినట్లుగా ఉంది. కానీ అది ఎక్కడిది అనే దాని గురించి సమాచారం లేదు. ప్రస్తుతం వర్షాకాలం .. దీంతో నెమలి పురి విప్పి నాట్యం చేయడం సర్వసాధారణమే కానీ, ప్రపంచం మాత్రం అలాంటి దృశ్యాలను చూడటం చాలా అరుదు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి:

ఈ అద్భుతమైన వీడియో @buitengebieden పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది . కేవలం 7 సెకన్ల ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 15 మిలియన్లకు పైగా అంటే 1.5 కోట్లకు పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. 5 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను కూడా లైక్ చేసారు.  కొందరు ఈ నెమలి వీడియోను అందంగా అభివర్ణించగా..  కొందరు దీనిని షో ఆఫ్ అని పేర్కొన్నారు. అదే సమయంలో.. కొంతమంది వినియోగదారులు కూడా ఇంతకు ముందు ఇంత అందమైన దృశ్యాన్ని చూడలేదని కూడా చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..