Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: విద్యుత్ షాక్ తో ఆవు మృతి.. కన్నీరు మున్నీరుగా విలపించిన యజమానురాలు.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మహిళ తన ఆవు చనిపోయిందని భోరున విలపిస్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు. వీడియోలో మహిళ   ఏడ్వడం చూస్తుంటే ఆవుకు ఆ మహిళకు మధ్య ఉన్న బంధం అర్ధం అవుతుంది.

Video Viral: విద్యుత్ షాక్ తో ఆవు మృతి.. కన్నీరు మున్నీరుగా విలపించిన యజమానురాలు.. వీడియో వైరల్
Cow Emotional Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 12, 2022 | 1:30 PM

Emotional Video Viral: మనుషుల్లాగే జంతువులు కూడా దేవుని అద్వితీయ సృష్టి. దేవుడు సృష్టించిన వనరులపై జంతువులకు కూడా అదే హక్కు ఉంది. కానీ మనిషిలో పెరుగుతున్న స్వార్థంతో.. జంతువుల నుండి ఈ హక్కును మనిషి తీసేసుకున్నాడు. మనిషి తన స్వార్థంతో గుడ్డివాడుగా ప్రవర్తిస్తూ.. ప్రకృతిని డబ్బుని సృష్టించే ఓ యంత్రంగా, తన అభివృద్ధికి ఓ తారక మంత్రంగా ఉపయోగించుకుంటున్నాడు. అంతేకాదు మనిషి  అమాయకులను చంపడానికి వెనుకాడడం లేదు.. అయితే మనుషులంతా ఓ రీతిలో ఉండరు.. కొంతమంది ప్రకృతిని, జంవుతులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుక్క, పిల్లి, ఆవు వంటి అనేక జంతువులను తమ కుటుంబంలో భాగంగా భావించి పెంచుకుంటారు. తాము ఎంతో ప్రేమగా, ఇష్టంగా పెంచుకున్న జంతువులకు ఏదైనా జరిగితే ఆ బాధను తట్టుకోలేక వెక్కి వెక్కి వెక్కి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. ఇటీవలి కాలంలో అలాంటి మహిళకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసిన తర్వాత.. ఎవరైనా తమకు ఇష్టమైనవారు లోకాన్ని విడిచిపెట్టినప్పుడు.. ప్రేమగా పెంచుకున్న యజమాని ఎంతగా బాధపడతాడో చూపరులకు అర్థమవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మహిళ తన ఆవు చనిపోయిందని భోరున విలపిస్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు. వీడియోలో మహిళ   ఏడ్వడం చూస్తుంటే ఆవుకు ఆ మహిళకు మధ్య ఉన్న బంధం అర్ధం అవుతుంది. అక్కడ ఉన్న వ్యక్తులు ఆవు కళేబరం దగ్గర నుంచి మహిళను పక్కకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ మహిళ ఆవును కౌగలించుకుని వదిలిపెట్టడంలేదు.

ఇవి కూడా చదవండి

మనసుకు హత్తుకునే ఈ వీడియో @QaziShibli అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కరెంటు తీగ తగిలి ఆవు చనిపోయిందని, ఆ మహిళ రోదిస్తున్నదని క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియో చూపరుల హృదయాన్ని హత్తుకునేలా ఉంది. అయితే జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించే  వేలాది మందికి ఈ వీడియో ఖచ్చితంగా గుణపాఠం.

వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. మనసుకు నొప్పి మనుషుల నిష్క్రమణ వల్ల మాత్రమే కలగదు.. మనకు ప్రియమైన వారు జీవితం నుంచి నిష్క్రమణ తర్వాత కూడా కళ్ళు తడి అవుతాయి.

ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి