ఫేక్ ఐపీఎల్.. బుకీలు చెప్పినట్లే ఫోర్లు, సిక్సులు.. గుజరాత్‌లో బట్టబయలైన బెట్టింగ్ ముఠా మోసాలు..

ఈ వార్త విన్న హర్ష భోగ్లే కూడా షాక్ అయ్యారంట. నాలా కామెంట్రీ చేసిన వ్యక్తిని చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశారు.

ఫేక్ ఐపీఎల్.. బుకీలు చెప్పినట్లే ఫోర్లు, సిక్సులు.. గుజరాత్‌లో బట్టబయలైన బెట్టింగ్ ముఠా మోసాలు..
Fake Ipl
Follow us
Venkata Chari

|

Updated on: Jul 12, 2022 | 2:16 PM

ఐపీఎల్ తరహాలో మ్యాచ్‌లు నిర్వహించి బెట్టింగ్ నిర్వహించే ముఠాను గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఈ ముఠా అధినేత రష్యాలో ఉన్నాడని, అక్కడి నుంచే ఇదంతా నడిపిస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. ఈ లీగ్‌లో ఆటగాడి నుంచి అంపైర్‌తోపాటు ఫీల్డ్ వరకు ప్రతిదీ నకిలీదేనని, కేవలం డబ్బు కోసం బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లీగ్ మ్యాచ్‌లు కూడా యాప్‌లో ప్రసారం చేస్తున్నారని, దీంతోనే ప్రజలు బెట్టింగ్‌లు కడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బుకీల నుంచి పెద్దఎత్తున కెమెరాలు, ఫోన్లు, క్రికెట్ కిట్‌లు, వివిధ రకాల మెషిన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో కొందరు వ్యక్తులు ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మాలీపూర్ గ్రామంలోని ఈ ఫామ్‌హౌస్‌లో క్రికెట్ మైదానాన్ని నిర్మించి, దానికి ఐపీఎల్ స్టేడియం రూపాన్ని ఇచ్చారు. ఫ్లడ్‌లైట్ల నుంచి కెమెరా, వ్యాఖ్యానం చేసే బ్లాక్ వరకు అన్నీ ఏర్పాటు చేశారు. అంపైర్లు, వ్యాఖ్యాతలను కూడా పిలిచారు. గ్రామంలోని క్రీడాకారులను పిలిచి, వారికి ప్రతీ మ్యాచ్‌కు రూ. 400లు ఇచ్చేవారు. అందుకు ప్రతిగా బుకీల కోరిక మేరకు మ్యాచ్‌లు ఆడుతూ ఫోర్లు, సిక్సర్లు కొట్టేవారంట.

ఇవి కూడా చదవండి

యాప్‌లో ప్రసారం..

ఈ మ్యాచ్‌‌లను యాప్‌లోనూ ప్రసారం చేశారంట. ఒక క్రీడాకారుడు హర్షా భోగ్లే స్వరంలో వ్యాఖ్యానిస్తున్నట్లు అచ్చం ఆయన గొంతునే దించేశారంట. బెట్టింగ్‌లు కట్టే వ్యక్తులు యాప్‌లో మ్యాచ్‌ను చూచి, దానిపై బెట్టింగ్‌లు కట్టేవారు. మ్యాచ్ ఫలితాన్ని, ప్రతి బంతికి ఫోర్, సిక్సర్ కొట్టే విషయాన్ని కూడా బుకీలు నిర్ణయించేవారు. దీని ఆధారంగా బెట్టింగులు జరిగేవంట. అలాగే ఆటగాళ్లకు సూచనలు అందించేవారంట.

ఈ వార్త విన్న హర్ష భోగ్లే కూడా షాక్ అయ్యారంట. నాలా కామెంట్రీ చేసిన వ్యక్తిని చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశారు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి