Watch Video: క్రికెట్ చరిత్రలో ఇలాంటి షాట్ వెరీ రేర్.. ఆశ్చర్యపోయిన సచిన్.. వీడియో చూస్తే మీరు కూడా..
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 55 బంతుల్లో 117 పరుగులు చేశాడు.
ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) తన సత్తా చాటాడు. సూర్యకుమార్ యాదవ్ 55 బంతుల్లో 117 పరుగులు చేసి అద్భుత సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడో మ్యాచ్‌లో ఓడిపోయియింది. దీంతో ఇంగ్లాండ్ టీం క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. 2-1 తేడాతో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ గెలిచినా.. సూర్యకుమార్ యాదవ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కొట్టిన ఓ సూపర్బ్ షాట్ చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ కూడా ఈ షాట్ చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నాడు.
ఆ షాట్ ఎంతో అద్భుతం..
15వ ఓవర్ వేయడానికి వచ్చిన గ్లీసన్ బంతిని సూర్యకుమార్ యాదవ్ అంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. లెగ్ సైడ్‌లో యార్కర్ విసిరి సూర్యకుమార్‌ను కట్టడి చేసేందుకు ఈ ఇంగ్లీష్ బౌలర్ ప్రయత్నించాడు. కానీ, సూర్యకుమార్ తన మణికట్టును వెనక్కి తిప్పి పాయింట్ మీదుగా భారీ సిక్స్ బాదేశాడు. సూర్యకుమార్ కొట్టిన ఈ షాట్ చూసి ఇంగ్లండ్ ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారు. సూర్యకుమార్ షాట్ చూసి గ్లీసన్ కూడా నవ్వుతూ కనిపించాడు.
సూర్యకుమార్ షాట్ ఆశ్చర్యపోయిన సచిన్..
సూర్యకుమార్ కొట్టిన ఈ షాట్ సచిన్ టెండూల్కర్‌ను కూడా ఆశ్చర్యపరిచింది. ఈమేరకు సచిన్ ట్వీట్ చేస్తూ, ‘ ఇదో అద్భుతమైన సెంచరీ సూర్యకుమార్ యాదవ్. మ్యాచ్‌లో సూపర్ షాట్స్‌తో ఆశ్చర్యపరిచావు. అయితే, పాయింట్ మీద నుంచి స్కూప్ షాట్ మాత్రం నిజంగా ఓ అద్భుతం’ అంటూ పొగడ్తల వర్షం కురిపంచారు.
An extraordinary shot.
Scorecard/clips: https://t.co/AlPm6qHnwj
??????? #ENGvIND ?? pic.twitter.com/JBcZStcP7l
— England Cricket (@englandcricket) July 10, 2022
ఇంగ్లండ్‌ను గడగడలాడించిన సూర్యకుమార్ యాదవ్..
ట్రెంట్ బ్రిడ్జ్‌లో సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ గొప్పతనాన్ని చూపించాడు. సూర్యకుమార్ క్రీజులోకి వచ్చేసరికి జట్టు 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే, దీని తర్వాత సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. వీరిద్దరి మధ్య 62 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇందులో అయ్యర్ సహకారం కేవలం 28 పరుగులే కావడం విశేషం. అయితే అయ్యర్ ఔటైన తర్వాత టీమ్ ఇండియా ఇన్నింగ్స్ చెదిరిపోయింది. వేగంగా పరుగులు చేయలేకపోవడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది.
కాగా, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ కూడా సూర్యకుమార్ బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. సూర్యకుమార్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడినా గెలవడానికి మాత్రం పూర్తి అర్హుడు అని టోప్లీ పేర్కొన్నాడు. సూర్యకుమార్ ఆడిన షాట్లను క్రికెట్‌లో ఇప్పటి వరకు చూడలేదని టాప్లీ చెప్పుకొచ్చాడు.