టాలెంట్ ఉన్నోళ్లు చాలామందే ఉన్నారు.. నువ్వు వెళ్లి దేశవాళీలో ఆడు.. కోహ్లీపై మాజీ బౌలర్ కీలక వ్యాఖ్యలు..

విరాట్ కోహ్లి ఆటతీరు చూసి అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా..

టాలెంట్ ఉన్నోళ్లు చాలామందే ఉన్నారు.. నువ్వు వెళ్లి దేశవాళీలో ఆడు.. కోహ్లీపై మాజీ బౌలర్ కీలక వ్యాఖ్యలు..
Virat Kohli Form
Follow us
Venkata Chari

|

Updated on: Jul 11, 2022 | 3:42 PM

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ముగిసింది. అయితే, అదే సమయంలో చాలా ప్రశ్నలను మిగిల్చింది. టీమిండియా విజయం తర్వాత ఆటగాళ్ల ప్రదర్శన విషయంలో మాజీల నుంచి ఫ్యాన్స్ వరకు అంతా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఆటపై మాత్రం ఎన్నో ప్రశ్నల వర్షం కురుస్తోంది. విరాట్ కోహ్లి ఆటతీరు చూసి అభిమానులు, క్రికెట్ ప్రపంచం షాకవుతోంది. దీంతో కోహ్లీ పేలవ ప్రదర్శనను ప్రశ్నిస్తూ.. భారత మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా, ఈ జాబితా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా టీమిండియా మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ మాట్లాడుతూ, టీమ్‌లో టాలెంట్‌కు కొదవ లేనప్పుడు కేవలం విరాట్‌పైనే ఎందుకు దృష్టి పెడుతున్నారంటూ బాంబ్ పేల్చాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో వెంకటేష్ ప్రసాద్ మూడు వరుస ట్వీట్లతో విరుచకపడ్డాడు. అందులో విరాట్ కోహ్లీని టార్గెట్ చేయడమే కాకుండా, కొంతమంది భారత మాజీ ఆటగాళ్లను కూడా ఇందులో పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫాం బాగోలేదని, దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫామ్‌ను సాధించాలని సూచించాడు.

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు.. విరాట్ కోహ్లీపై దాడి!

వెంకటేష్ ప్రసాద్ తన మొదటి ట్వీట్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీని కొనియాడుతూ కీలక విషయం ప్రకటించాడు. టీ20 జట్టులో శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని, అతనిలా జట్టులో ఉండాల్సిన బ్యాట్స్‌మెన్‌లు మరికొందరు ఉన్నారు. కానీ, వారిని తప్పించారు. అందులో ప్రముఖంగా దీపక్ హుడా అద్భుతంగా ఆడుతున్నప్పుడు, బెంచ్‌కే పరిమితం చేసి, కోహ్లిని ఆడించడం తప్పే’ అంటూ రాసుకొచ్చాడు.

వెళ్లి దేశవాళీ క్రికెట్‌లో పరుగులు తీయండి..

తన రెండవ ట్వీట్‌లో, “ఒక ఆటగాడి జీవితంలో అతను ఫామ్‌లో లేకపోతే, అతను జట్టు నుంచి తప్పుకోవడం చాలా మంచి నిర్ణయం. ఇలాంటి సందర్భాల్లో గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్, జహీర్, భజ్జీలు కీలక నిర్ణయం తీసుకుని, ఆదర్శంగా నిలిచారు. వారు ఫామ్‌లో లేనప్పుడు జట్టు నుంచి తప్పుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడి పరుగులు సాధించి, తమ ఫామ్‌ను సంపాదించుకుని, తిరిగి జట్టులోకి వచ్చారు. భారత క్రికెట్‌లో అనిల్ కుంబ్లే బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అని చెప్పుకొచ్చాడు. కానీ, పేలవమైన ఫామ్ కారణంగా అతను జట్టుకు కూడా దూరం కావాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

ఫామ్‌లో లేనందుకు ఇఫ్పుడు ఆటగాళ్లు విశ్రాంతి పేరుతో ఖాళీగా కూర్చుంటున్నారు. ఇది పురోగతికి మార్గం కాదు. దేశంలో ఎంతో మంది ప్రతిభ ఉండి, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలంటే, మ్యాచ్‌ నుంచి తప్పుకోవాలని సూచించాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో విరాట్ ప్రదర్శన..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్‌లో 1 పరుగు, మూడో మ్యాచ్‌లో 11 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాడ్ ఫాంతో సతమతమవుతున్నాడని అర్థమవుతోంది. అందుకే ఈ రోజు అతనిపై విమర్శల వర్షం కురుస్తోంది. మరి దీనికి విరాట్ కోహ్లీ ఎలాంటి సమాధానాలు అందిస్తాడో చూడాలి.