AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Final : టీమిండియాకు ఫైనల్ టెన్షన్..నంబర్ వన్ ప్లేయర్ల ఫామ్ పై కోచ్ గంభీర్ తల బాదుకుంటున్నాడా?

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు ముందు అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ల ఫామ్ టీమ్ ఇండియాను కలవరపెడుతోంది. వారి స్థానంలో సంజూ శాంసన్, మహమ్మద్ సిరాజ్ వచ్చే అవకాశం ఉంది.

T20 World Cup Final : టీమిండియాకు ఫైనల్ టెన్షన్..నంబర్ వన్ ప్లేయర్ల ఫామ్ పై కోచ్ గంభీర్ తల బాదుకుంటున్నాడా?
Abhishek Varun
Rakesh
|

Updated on: Mar 07, 2026 | 5:00 PM

Share

T20 World Cup Final : టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు సర్వం సిద్ధమైంది. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత శిబిరంలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ, నంబర్ వన్ బౌలర్ వరుణ్ చక్రవర్తిల ఫామ్ ఇప్పుడు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఫైనల్ లాంటి అతిపెద్ద మ్యాచ్‌లో వీరిద్దరినీ పక్కన పెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అభిషేక్ శర్మ ఫామ్ లేమి.. సంజూ శాంసన్ జోరు

ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ హోదాలో టోర్నీలోకి అడుగుపెట్టిన అభిషేక్ శర్మ, ఈ వరల్డ్ కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు సార్లు డకౌట్ అవ్వడం గమనార్హం. మధ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరడం కూడా అతని ఫామ్‎ను దెబ్బతీసింది. మరోవైపు బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన కొద్ది మ్యాచ్‌ల్లోనే 97*, 89 వంటి స్కోర్లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులోకి వచ్చాడు. దీంతో అభిషేక్ స్థానంలో సంజూను ఓపెనర్‌గా పంపాలనే డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా కివీస్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్‌ను ఎదుర్కోవడంలో అభిషేక్ ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో సంజూ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.

వరుణ్ చక్రవర్తి ఖరీదైన స్పెల్.. సిరాజ్ రీ-ఎంట్రీ?

బౌలింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అతను వికెట్లు తీస్తున్నప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, వరుణ్ స్థానంలో అనుభవజ్ఞుడైన మహమ్మద్ సిరాజ్ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్ తర్వాత సిరాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

సూర్య, గంభీర్ తీసుకునే నిర్ణయం ఏంటి?

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు ధర్మసంకటంలో ఉన్నారు. నంబర్ వన్ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి ఫైనల్లో ఛాన్స్ ఇస్తారా? లేక ఫామ్‌లో ఉన్న ప్లేయర్ల కోసం వారిని పక్కన పెడతారా? అన్నది తేలాల్సి ఉంది. సంజూ శాంసన్ మాత్రం అభిషేక్ శర్మకు మద్దతుగా నిలుస్తున్నాడు. “అభిషేక్ చాలా ఒడిదుడుకులు చూశాడు, ఫైనల్ రోజు అతను ఖచ్చితంగా చెలరేగుతాడనే నమ్మకం మాకుంది” అని సంజూ వ్యాఖ్యానించాడు. ఏదేమైనా, కివీస్ గండాన్ని దాటి కప్పు కొట్టాలంటే టీమిండియా తుది జట్టు ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us