Watch Video: ప్రధాని మోదీ మాటలతో భావోద్వేగానికి లోనైన లేడీ సచిన్.. ఎందుకో తెలుసా?
2017లో ఘోర పరాజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిలుపు వచ్చిందని, మేమెంతో భయపడ్డాం కానీ, అక్కడ జరిగిన సంఘటన మాత్రం వేరేలా ఉందంటూ..
భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్(Mithali Raj) నాయకత్వంలో భారత జట్టు 2017 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఇంగ్లండ్ టీం భారత మహిళల కలను నీరుగార్చింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే భారత్ ప్రదర్శన తీరు అందరి హృదయాలను గెలుచుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఓటమి తర్వాత టీమిండియా తిరిగి స్వదేశం రాగానే, దేశం మొత్తం వారికి ఘన స్వాగతం పలికింది. అయితే, ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. తాజాగా లేడీ సచిన్ ఓ రియాలిటీ షోలో పాల్గొంది. ఆనాడు జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. ఓటమి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయాన్ని ఈమె చెప్పుకొచ్చింది. హృదయ విదారక ఓటమి తర్వాత దేశ ప్రధాని తన జట్టును ఎలా ప్రోత్సహించారో గుర్తు చేసుకుని, భావోద్వేగానికి గురైంది.
ప్రధానిని కలవడం గౌరవంగా ఉంది..
నిజానికి ఈ షోలో ఒక పోటీదారుడు భారత మాజీ కెప్టెన్ మిథాలీని ప్రధానిని కలవడం ఎలా అనిపించిందని అడిగాడు. దానిపై మిథాలీ మాట్లాడుతూ 2017లో తన జట్టు ప్రపంచకప్ నుంచి తిరిగి వచ్చినప్పుడు, తనకు స్వాగతం పలికిన తీరు ఎంతో అద్భుతమైనది. భారత్ తరపున 232 వన్డేల్లో 7 వేల 805 పరుగులు చేసిన మిథాలీ.. ప్రధాని మోదీ మా కోసం కొంత సమయం వెచ్చిచడం ఎప్పటికీ వచ్చిపోలేమని, అదొక గౌరవంగా మేం ఫీలవుతున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది.
Must hear what Indian cricketer @M_Raj03 is saying about our PM Shri @narendramodi ji pic.twitter.com/174DzbgmOX
— Bishamber Valmiki (@BishamberMla) July 11, 2022
ప్రతీ ప్రశ్నకు సమాధానాలు ఇచ్చారు..
టీమ్‌లోని ప్రతి అమ్మాయిని ప్రధాని మోదీ పేరుపేరునా గుర్తించారని మిథాలీ తెలిపారు. జట్టులోని ప్రతి ఒక్కరి ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మేం ఓడిపోయినా, ప్రధాని తమ విలువైన సమయం వెచ్చించి జాతీయ జట్టును ప్రోత్సహించడం గౌరవప్రదమైన విషయమని, మీరు ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ఆయన మాతో అన్నారని పేర్కొంది. 2017లో లార్డ్స్ చారిత్రాత్మక మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతే, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్‌కు 229 పరుగుల లక్ష్యాన్ని అందించింది. దీంతో భారత జట్టు 219 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ మ్యాచ్‌లో పూనమ్ రౌత్ 86 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 51 పరుగులు చేసింది.