Smart Phone : రూ.101కే స్మార్ట్ ఫోన్..! షో రూమ్‌కు ఎగబడ్డ జనాలు.. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ..

నిత్యావసర వస్తువుగా మారిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లలో రూ.5 వేల నుంచి లక్షలకు విక్రయిస్తున్నారు. కానీ, కొత్త ప్రారంభించిన ఒక సెల్ ఫోన్ షాపులో..

Smart Phone : రూ.101కే స్మార్ట్ ఫోన్..!  షో రూమ్‌కు ఎగబడ్డ జనాలు.. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ..
Smart Phone
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 15, 2022 | 10:29 AM

smart phone :  ఆధునికత పెరుగుతున్న ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లు వాడని వారు ఉండరనే స్థాయిలో మనిషికి థర్డ్‌ హ్యాండ్‌గా మారింది. కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగపడిన సెల్‌ఫోన్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల రూపంలో మనిషికి అవసరమైన వివిధ పనులను సులభతరం చేస్తున్నాయి. నిత్యావసర వస్తువుగా మారిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లలో రూ.5 వేల నుంచి లక్షలకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కొత్త ప్రారంభించిన ఒక సెల్ ఫోన్ షాపులో కేవలం 101 రూపాయలకే స్మార్ట్ ఫోన్ విక్రయిస్తామని ప్రకటించారు. ఇంకేముంది.. జనాలు ఎగబడ్డారు. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ వస్తుందని తెలిసి షాపు ముందు కస్టమర్లు క్యూ కట్టారు. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకుంది.

Smart Phone 1

కోయంబత్తూరులోని గాంధీపురం 9వ వీధిలో కొత్తగా సెల్‌ఫోన్‌ షాప్‌ ఓపెన్‌ చేశారు. ఈ షాపులో పిక్సెల్ కమ్యూనికేషన్, ఉపయోగించిన సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్‌లను విక్రయిస్తుంటారు . ఈ స్టోర్ ప్రారంభోత్సవ ఆఫర్‌గా రూ.3,000కి ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారు కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చని ప్రకటించారు. దాంతో ఈ వార్త జిల్లా వ్యాప్తంగా దవానంలా వ్యాపించింది. రూ. 101 రూపాయల స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి దుకాణం ముందు జనం గుమిగూడారు. కోయంబత్తూరు నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు ఈ దుకాణంలో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి